Movies

ఈ సినీ ప్రముఖుల కూతుళ్లు ఏ రంగాన్ని ఎంచుకొని సక్సెస్ అయ్యారో చూడండి

సాధారణంగా పిల్లలు తమ తల్లితండ్రులు ఎంచుకున్న రంగాల్లోకి వెళ్ళటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది రాజకీయాల్లో,సినిమాల్లోనూ ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు కొంతమంది సినీ ప్రముఖుల పిల్లలు సినీ రంగాన్ని కాకుండా ఏ రంగాన్ని ఎంచుకున్నారో తెలుసుకుందాం.

నారా బ్రాహ్మణి
రాజకీయ,సినీ నేపధ్యం ఉన్న బ్రాహ్మణి ఈ రెండు రంగాలను కాదని వ్యాపార రంగాన్ని ఎంచుకొని హెరిటేజ్ గ్రూప్స్ కి ఎక్సిక్యుటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. బాలకృష్ణ ముద్దుల తనయ అయినా బ్రాహ్మణి నారా చంద్రబాబు నాయుడు కోడలు.

సుస్మిత
మెగా డాటర్ అయినా సుస్మిత సినిమాల్లో హీరోయిన్ గా కాకూండా తెర వెనక పనిచేస్తుంది. ఫ్యాషన్ డిజైనింగ్ మరియు స్టైలిస్ట్ గా వర్క్ చేస్తూ బిజీగా ఉంది. చిరంజీవి 150 సినిమా,మీ లో ఎవరు కోటిశ్వరుడు ప్రొగ్రాంలో తన తండ్రి చిరంజీవికి స్టైలిష్ట్ గా వర్క్ చేసింది. అలాగే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కి కూడా స్టైలిష్ట్ గా పనిచేసింది.

పురందేశ్వరి
ఐదు భాషల్లో అనర్గలంగా మాట్లాడగలిగే పురందేశ్వరి తండ్రి నందమూరి తారక రామారావు ఏర్పరిచిన రెండు బాటల్లో సినీ రంగాన్ని కాకుండా రాజకీయ రంగాన్ని ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. పురందేశ్వరి జెమాలజీ మీద కోర్స్ చేసి హైదరాబాద్ ఇన్సట్యూట్ జెమ్స్ అండ్ జువెలరీ ని స్థాపించింది. అంతేకాక ఆమె మంచి కూచిపూడి డాన్సర్.

నాగసుశీల
అక్కినేని నాగేశ్వరావు కూతురు అయినా నాగసుశీల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తూ నిర్మాతగా కొన్ని సినిమాలను చేసి కొడుకును హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాక అన్నపూర్ణ స్టూడియో బాద్యతలు,అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మీడియా డైరెక్టర్ గా ఉన్నారు.

రయానే
సాధారణంగా హీరోయిన్స్ కూతుళ్లు హీరోయిన్ అవ్వాలని అనుకుంటారు. కానీ రాధిక కూతురు హీరోయిన్ గా కాకుండా తెర వెనక ఉండాలని నిర్ణయం తీసుకోని రాధిక నిర్మాణ సంస్థ రాడాన్ మీడియాకు మీడియా హెడ్ గా వర్క్ చేస్తుంది.