Kitchen

సుబ్బయ్య హోటల్ ఇప్పుడు హైదరాబాద్ లో మెనూ,స్పెషలిటీ తెలిస్తే ఇప్పుడే పరిగెడతారు తినడానికి

హోటల్ భోజనం అంటే మనకు కావాల్సింది వడ్డించి వెళ్లిపోవడం, మళ్ళీ కావాలన్నా ఏదో తప్పదురా అన్నట్లు మొహం చిట్లిచుకుంటూ వడ్డిస్తారు. కొన్ని హోటల్స్ అయితే మర్యాద కూడా సరిగ్గా ఉండదు. ఇక స్టార్ హోటల్స్ లో సైతం మర్యాద, మన్నన దొరకవు. అయితే ఏనాడో కాకినాడలో పెట్టిన సుబ్బయ్య హోటల్ అలా కాదు. అత్తారింటికి వెళ్తే అల్లుడికి ఎంత మర్యాద చేస్తారో అంతమర్యాదగా కొసరి కొసరి వడ్డిస్తారు. అది ఇక్కడ స్పెషాలిటీ. అంతేకాదు తినడానికి కడుపు చాలదు అన్నట్లు ఎన్నో వెరైటీలు భోజనంలో మనకు కనిపిస్తాయి.

కాకినాడ సుబ్బయ్య హోటల్ అంటే అంత క్రేజ్ మరి. ఇక ఈ హోటల్ కి వెళ్లి తినడానికి నిజంగా ధైర్యం ఉండాలి. ముందుగా స్వీటు మొదలెట్టి, కూర, పప్పు, సాంబారు, వేపుడు,మజ్జిగ, చారు ఇలా ఎన్నో వెరైటీలతో భోజనం పెట్టి, ఇక చాలురా బాబు అనేంతగా వడ్డిస్తారు. చివరికో ఓ గ్లాస్ మజ్జిగ అందించి, తాగండి చలవచేస్తుందని చెబుతారు.

చాలామంది ప్రముఖులు,సెలబ్రిటీలు ఈ హోటల్ ని బాగా ఇష్టపడతారు. అన్న ఎన్టీఆర్ అయితే తూర్పు గోదావరి జిల్లాకు వచ్చినపుడు ఇక్కడ భోజనం చేసి వెళ్లేవారని చాలామంది ఇప్పటికీ చెబుతుంటారు. హోటల్ కి వెళ్ళగానే ఆకు వేసి, ముందుగా స్వీట్ ఇచ్చాక , మజ్జిగ వడ లో బూందీ పన్నులకు చల్లి ఆవడ ఇస్తారు. పులిహోర, ఫ్రాయిడ్ రైస్,చపాతీ, రెండు రకాల కూరలు, చెట్నీలు ,పచ్చళ్ళు,ఇలా అన్ని వరుసగా ప్రత్యక్షం అవుతాయి.

తూర్పు గోదావరి కి ఇంతగా ఖ్యాతి తెచ్చిన సుబ్బయ్య హోటల్ ఇప్పుడు హైదరాబాద్ కి పాకింది. నిజానికి ఈ హోటల్ తూర్పు గోదావరి వాళ్ళు పెట్టలేదు.నెల్లూరు చెందిన గునుపూడి సుబ్బారావు గారు కాకినాడ వచ్చి, అద్దెలు తీసుకుని, హోటల్ స్టార్ చేశారు. మొదట్లో పీటలు వేసి అరిటాకు భోజనం పెట్టేవారట.

అలా మొదలైన సుబ్బయ్య హోటల్ రానురాను అభివృద్ధి చెందింది. ఇక్కడ ఉండే ఐటమ్స్ ఇక్కడా కనిపించవు. సాంబారు, ఉలవచారు, మజ్జిగ పులుసు,రకరకాల పచ్చళ్ళు,కుండలో తోడు పెట్టిన గడ్డ పెరుగు ఇలా ఒకటేమిటి ఏదీ వదలకుండా సుష్టుగా లాగించేస్తాం. హైదరాబాద్ లో కూడా అందరినీ అలరిస్తున్న సుబ్బయ్య హోటల్ కి ఓసారి వెళ్లి వద్దాం ఇక ఎందుకు ఆలస్యం.