Movies

అక్కినేని గురించి వెలుగుచూస్తున్న షాకింగ్ న్యూస్…నమ్మలేని నిజాలు

ఒకప్పుడు తెలుగు వెండితెరకు ఎన్టీఆర్,ఏ ఎన్ ఆర్ లను రెండు కల్లుగా భావించేవారు. అది ఇప్పటికీ అందరూ ప్రస్తావించి ఆ మహానటులను గౌరవిస్తుంటారు. అయితే ఎన్టీఆర్ కంటే చాలా ముందే అక్కినేని నాగేశ్వరరావు సినీ రంగంలో కాలుమోపారు. 85 ఏళ్ళ తెలుగు సినీ పరిశ్రమకు ప్రత్యక్ష సాక్షి అయిన 75 ఏళ్ళు నటించారంటే మామూలు విషయం కాదు. మూకీ చిత్రాలప్పుడు ఫీల్డ్ లోకి వచ్చిన అక్కినేని హీరో అంటే స్టెప్పులు వేయాలని చేసి చూపిన ఘనుడు. నిజానికి అక్కినేని అల్లా టప్పాగా హీరో అవ్వలేదు. బక్కపలచగా ఉండే ఇతను హీరో ఏంటి,అందం లేదు ఎలా పనికొస్తాడు ఇలా అన్నవాళ్ళే మళ్ళీ నెత్తిన పెట్టుకున్నారు. దీన్ని బట్టి అక్కినేని కృషి ఇంతటితో చెప్పక్కర్లేదు.

క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన అక్కినేని స్వయం కృషితో ఎదిగి, తన నటజీవితాన్ని, నిజ జీవితాన్ని చక్కదిద్దుకుని,బంగారు బాటలు వేసుకున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే మరపురాని నటుడిగా నిల్చిన అక్కినేని 1923 సెప్టెంబర్20న జన్మించారు. సంపన్న కుటుంబంలో పుట్టినా చదువుకోలేకపోయారు. సినీ ఇండస్ట్రీకి వచ్చాక ఎన్ని భాధలు, మాటలు పడ్డారు. నాస్తికుడైన ఏ.ఎన్. ఆర్ తాను దేవుణ్ణి నమ్మకపోయినా ఇతరులు మాత్రం నమ్ముకుంటే ఏమీ అనేవారు కాదు.

కానీ యాదృచ్ఛికమో ఏమో గానీ భక్తుడి పాత్రల్లోనే ఆయన రక్తికట్టారు. ఆయా పాత్రలకు జీవం పోశారు.మహాకవి క్షేత్రయ్య, భక్త జయదేవ లాంటి ఎన్నో సినిమాలు చూస్తే భక్తుడంటే ఇలా ఉంటాడా అనిపించారు అక్కినేని. ఓటమిని సైతం ధైర్యంగా ఒప్పుకునే సుగుణం ఆయన సొంతం. వ్యక్తిత్వంలో శిఖరాలు అధిరోహించారు. రిస్క్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇది నీవల్ల కాదని అంటే ఆయన ససేమిరా అంగీకరించేవారు కాదు. నటనలో ఓ కొత్త వరవడి సృషించిన అక్కినేనిని స్టైల్ ని చాలామంది ఇప్పటికీ అనుకరించి చూపడం సహజంగా మారింది.

అంతెందుకు కుప్పిగంతులతో సాగే పాటలకు స్టెప్పులు జోడికట్టించిన ఘనత అక్కినేనిదే. ఆయన స్టెప్పులు వేస్తే, జనం ఈలలు వేస్తూ, కేరింతలు కొట్టేవారు. బ్రేక్ డాన్స్ లు, షేక్ డాన్స్ లు రావడానికి కూడా అక్కినేని కారణం. 7న్నర దశబ్దాల పాటు తెలుగు తెలుగు కళామతల్లి సేవలోనే ఓలలాడిన అక్కినేని తెలుగు సినిమా చరిత్రకు దర్పణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి అక్కినేని ప్రధాన కారణం.

గుండె ఆపరేషన్ అయ్యాక నటించడం కుదరదని డాక్టర్లు తేల్చిచెప్పినా సరే, నటించి చూపడమే కాదు స్టెప్పులతో టాప్ లేపారు. ఈవిధంగా గుండె అపరేషన్ తర్వాత నాలుగు దశాబ్దాల పాటు నటించిన హీరోగా ప్రపంచ రికార్డు సృష్టించారు. దటీజ్ అక్కినేని. అంతేకాదు తనకు క్యాన్సర్ సోకినా విషయాన్ని సైతం ధైర్యంగా చెప్పిన ధీశాలి. మీ అభిమానమే నా ఆయుష్షు అంటూ అభిమానులకు సవాల్ విసిరినా ఆయనకే చెల్లింది. 2014జనవరి 22న అక్కినేని ఈలోకం నుంచి నిష్క్రమించారు.