Politics

100 సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉందో తెలుసా? ఈ అరుదైన చిత్రాలను చూడండి

మనం ఇల్లు సర్దినప్పుడు పాత ఫోటోలు కనపడుతూ ఉంటాయి. వాటిని చూస్తూ గతంలోకి వెళ్ళిపోతాం. ఆ జ్ఞాపకాలు తీపి గుర్తులుగా ఉంటాయి. ఇప్పుడు అటువంటి ఫోటోలను చూద్దాం. 100 సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉందో తెలుసా? ఈ అరుదైన చిత్రాలను చూస్తే అర్ధం అవుతుంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా డైమండ్ జూబ్లీని జరుపుకున్నప్పటి ఫొటో ఇది..1989లోది ఈ పిక్చర్.

1940 లో పెషావర్ లోని ఫోటో ఇది..అప్పటి సైన్ బోర్డ్స్ అన్ని పంజాబీలో లేదా ఉర్దూలో ఉండడాన్ని ఈ పోటోలో గమనించొచ్చు.

ఎయిర్ ఇండియా అటెండెంట్ ,ఫ్లైట్ టైమింగ్స్ ను బొర్డు పై రాస్తున్న ఈ ఫోటో 1963లోది..

ఇది 1946 డిసెంబర్ 9 న, భారత రాజ్యాంగ అసెంబ్లీ మొదటి సమావేశం.ఈ ఫొటోలో వల్లబాయ్ పటేల్,నెహ్రూ,అంబేధ్కర్ తదితరులను గమనించవచ్చు.

భారతదేశపు మొట్టమొదటి ప్రధమ పౌరుడు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్.గుర్రపు బండిలో ఊరేగుతున్నప్పటి ఫొటో ఇది.

సుమారు 100 ఏళ్లక్రితం క్యాప్చర్ చేయబడిన తాజ్ మహల్ ఫొటో ఇది.దీన్ని ఈస్ట్ ఇండియా కంపెనికి చెందిన డా.జాన్ మూర్ తీసారు.

చాలా చాలా అరుదైన చిత్రం ఇది..దీంట్లో మీరు ఇద్దరు మహారాణులను చూడొచ్చు.ఒకరు క్వీన్ ఎలిజబెత్,మరొకరు మహారాణి గాయత్రి దేవి.అప్పట్లో రాజులు,రాణులువేటకు వెళ్లేవారనే విషయాలు మనకు తెలుసు..ఆ సంధర్బమే మనకు ఈ ఫొటోలో కనపడుతుంది.

భారతదేశంలోని కలకత్తాలో, 1930 లో, ధనవంతులైన ప్రజలు జీబ్రాను గుర్రపు బండిని లాగడానికి ఉపయోగించారు. ఇది రాయల్టీకి చిహ్నంగా కూడా భావించేవారు.

హూమాయున్ టూంబ్..ఈ సమాది చుట్టూ తోటతో నిర్మించబడింది..ఈ విధంగా భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి సమాధి.. 1565 లో ప్రారంభమై న ఈ సమాది నిర్మాణం 1572 AD లో పూర్తయింది.

భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి మెర్సిడెజ్ బెంజ్ టెల్కో కార్ ఇది.1954లో టాటా మోటార్స్ ద్వారా ముంబై కి తీసుకురాబడింది ఈ కార్.

భారతదేశం మరియు పాకిస్తాన్ విభజన సమయంలో 1947 అప్పటి ఫొటో ఇది..రెండు దేశాల మధ్య ఫైళ్లను పరీశిలిస్తున్న వ్యక్తి తలపట్టుకుని కూర్చున్న దృశ్యం.