Movies

ఈశ్వర్ మూవీలో ప్రభాస్ తండ్రి శివకృష్ణ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా ?

హీరో అంటే హీరోయిజం అంటే ఫైట్లు,పాటలకు స్టెప్పులు వేయడమే కాదు ఇంకా చాలా ఉంటాయి. ముఖ్యంగా కష్టాల్లో వుండే ప్రజలను చైతన్యవంతం చేసి,వారి సమస్యలు పరిష్కరించే వాళ్ళూ హీరోలే. అదే కోవలో కి వస్తాడు నటుడు శివకృష్ణ. ఈయన అలవోకగా గుప్పుతిప్పుకోకుండా డైలాగులు చెప్పే విప్లవ నాయక పాత్రలతో ఒకప్పుడు వెండితెరను ఉర్రూత లూగించాడు. ధనవంతుపై తిరగబడుతూ, కష్టజీవులకు అండగా నిల్చె పాత్రల్లో ఒదిగిపోయాడు. ఎంత పెద్ద షాట్ అయినా ఒకే టెక్ లో చెప్పేయడంలో శివకృష్ణకు సాటిలేరు. బిజెపి లీడర్ గా ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇంతకీ ఈయన సినీ ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టాడంటే,చలిచీమలు మూవీతో తెలుగు తెరపై అడుగుపెట్టాడు.

నిజానికి శివకృష్ణకు సినిమాల్లో ఎవరూ బ్యాక్ గ్రౌండ్ లేరు. కేవలం తన అభిమాన నటుడు ఎన్టీఆర్ పై గల పిచ్చి అభిమానంతో సినిమాల్లోకి ప్రవేశించిన శివకృష్ణ ప్రొడ్యూసర్ గా జీవితం ప్రారంభించి, చలిచీమలు చిత్రం నిర్మించారు. ఆతర్వాత మరోమలుపు మూవీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చరిత్ర ఏ సిరాతో రాసింది , నాదేశం,ఇది కాదు ముగింపు వంటి ఎన్నో విప్లవ పాత్రలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. విప్లవ పాత్రల్లో తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని పాత్రలు చేయడంతో దిట్ట.

ఇలా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న శివకృష్ణ ఆరోజుల్లో ఎన్టీఆర్, కృష్ణ,శోభన్ బాబు,వంటి స్టార్ హీరోలందరితో నటించాడు. గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెబుతూ సామాన్యులకు అండగా నిలిచే పాత్రలతో చెరగని ముద్రవేసుకున్నారు. ఇంతకీ ఈయన సినిమాల్లో పేదవాడికి అండగా ఉండే పేదరికం లో కొట్టుమిట్టాడే పాత్రల్లో రాణించిన శివకృష్ణ నిజానికి చాలా డబ్బున్నవాడే. అందుకే ఆరోజుల్లో ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టి,5సినిమాల వరకూ తీసేసారు.

నాలుగైదు ఇండస్ట్రీలకు అధినేత గా ఉంటున్న శివకృష్ణ సినిమాల్లోకి రాకముందే కోటీశ్వరుడు. ఈయనకు భార్య , ఇద్దరు కొడుకులు ఉన్నారు. తన అభిమాన నటుడిని కలవాలన్న ఒకేఒక్క లక్ష్యంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన శివకృష్ణ ఆనతి కాలంలోనే ఎన్టీఆర్ ని కలవడమే కాదు ఆయన చిత్రాల్లో నటించాడు కూడా. నాదేశం సినిమాలో శివకృష్ణ నటన చూసిన ఎన్టీఆర్ నీవు చాలా గొప్ప హీరోవి అవుతావని మెచ్చుకున్నాడు.

నన్ను అందరూ పెద్దపులి అంటారు. మరి నీవు చిన్నపులివి అంటూ ఎన్టీఆర్ ప్రశంసలతో ముంచెత్తేవారట. ఇక ఈయన కొడుకులు సినిమా రంగంలోకి రావడం ఇష్టంలేక సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారట. ఈశ్వర్,గాయం,విలన్ , మీనాక్షి,అల్లరి రాముడు అగ్ని కెరటాలు, అమ్మాయి బాగుంది ,జయం వంటి సినిమాల్లో తండ్రిగా, సపోర్టింగ్ పాత్రల్లో రాణించారు.