ఫాదర్ కి తెలియకుండా ‘సలోని’ ఏం చేసిందో తెలుసా – ఇంటరెస్టింగ్ న్యూస్
ఒకప్పుడు తెలుగు లో హీరోయిన్స్ కి కొదవ ఉండేది కాదు. రానురాను ఇతర భాషా చిత్రాలనుంచి హీరోయిన్స్ వస్తున్నారు. బాలీవుడ్ భామలు ఎందరో ఇలా వచ్చినవాళ్లే. ఇక ఆ మధ్య పలు చిత్రాల్లో తనదైన శైలిలో నటించిన ‘సలోని’ కూడా నార్త్ ఇండియా నుంచే వచ్చింది. ధన 51మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కొద్దికాలంలోనే ఆడియన్స్ మనసు దోచుకుంది. చూడగానే చక్కని రూపం,ముఖంలో హావభావాలు పలికించే నేర్పు ఆమె సొంతం. అందుకే తమిళం,హిందీ భాషల్లో కూడా ఈమె స్టార్ స్టేటస్ సాధించుకుంది. అందచందాలు,టాలెంట్ ఉన్నా అదృష్టం లేకపోవడంతో అనుకున్న స్థాయిలో మాత్రం ఈమె గుర్తింపు పొందలేదు.
మహారాష్ట్రలోని ఓ సింధీ ఫ్యామిలీకి చెందిన సలోని అసలు పేరు వందనా అశ్వాని. ఆమె తండ్రి నర్కటస్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ కమీషనర్. ఐదేళ్ల వయస్సులోనే ఆమె తండ్రికి ముంబయి కి బదిలీ అవ్వడంతో అక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఎడ్యుకేషన్ అంతా ముంబయిలోని సాగింది. సైకాలజీలో పట్టా పొందిన ఈమెకు కాలేజీ డేస్ లో ఉన్నప్పుడే నటనపై ఆసక్తి పెరిగింది. తండ్రి ఏదైనా గౌరవప్రదమైన జాబ్ చూసుకోమని తండ్రి చెప్పుకొచ్చాడు.
అయితే తల్లి మాత్రం ఆమె కోరికకు అనుగుణంగా ప్రోత్సాహం అందించడంతో తండ్రికి తెలియకుండా మోడలింగ్ ఏజన్సీకి ఫోటోలను పంపింది.
వాజ్ లైన్ లైఫ్ బాయ్,పారాచూట్ కొబ్బరినూనె,మూవీ,చిక్ షాంపు లకు సలోని మోడలింగ్ గా వ్యవహరించింది. నాటకాల్లో కూడా తానేమిటో నిరూపించుకున్న ఆమెకు 2003లో దిల్ పరదేశి హోగయా మూవీలో ఛాన్స్ దక్కింది. అప్పుడే ఆమె పేరు సలోని గా మార్చుకుంది. ఆతర్వాత రెండేళ్లకు ధన 51మూవీలో సుమంత్ పక్కన నటించి హిట్ కొట్టింది. ఒక ఊరిలో,చుక్కల్లో చంద్రుడు, కోకిల వంటి మూవీస్ లో నటించి, అవి కాస్తా ప్లాప్ అవ్వడంతో ఆమెకు నిరాశ ఎదురైంది.
ఇక సునీల్ హీరోగా 2010లో వచ్చిన మర్యాద రామన్న మూవీ ‘సలోని’కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా చెప్పవచ్చు. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాతో దూసుకుపోవాల్సిన ఈమెకు అనుకున్న స్థాయిలో ఛాన్స్ లు దక్కలేదు. ఒకవేళ ఛాన్స్ వచ్చినా చిన్న హీరోల సరసనే కావడంతో నిరాశకు గురైన సలోని కొన్ని మూవీస్ లో ఐటెం సాంగ్స్ కి సిద్ధం అయింది.
బాడీ గార్డ్,రేసుగుర్రం,వంటి చిత్రాల్లో మెరిసింది. 2016లో కమెడియన్ పృథ్వి హీరోగా వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు ఆమె చివరిగా నటించిన మూవీ. ఇక తాజాగా సంపూర్ణేష్ బాబు హీరోగా వస్తున్న టక్కరి దొంగ – చక్కని చుక్క మూవీలో నటిస్తోంది.