Movies

బాలకృష్ణ ‘సింహ’ గురించి నమ్మలేని నిజాలు

నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. ‘సింహ’ సినిమాతో బోయపాటి టాప్ డైరెక్టర్ లలో ఒకడిగా మారిపోయాడు. అప్పటివరకు రాని స్టార్ డమ్ ఒక్క ‘సింహ’ సినిమాతోనే వచ్చేసింది. దాంతో హీరోలందరూ బోయపాటి చుట్టూ తిరగటం ప్రారంభించారు. ‘సింహ’ సినిమాని యువ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మించారు. ఈ సినిమా కోసం బోయపాటి 75 లక్షలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమా సాధించిన విజయానికి ఆనందంతో నిర్మాత పిలిచి మరీ మరో 4 కోట్లు ఇచ్చాడు.అంటే ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరు సంవత్సరాల తర్వాత బాలయ్య బాబుకి ‘సింహ’ ద్వారా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఈ సినిమా గురించి కొన్ని నిజాలను తెలుసుకుందాం. 

ఈ సినిమాని 350 దియేటర్స్ లో విడుదల చేసారు.

‘సింహ’ సినిమా 338 దియేటర్స్ లో 50 రోజులు ఆడగా,92 దియేటర్స్ లో 100 రోజులు ఆడింది. 
2010 లో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి 15 కోట్లు ఖర్చు చేస్తే 35 కోట్ల లాభం వచ్చింది. 

అంతేకాక బాలయ్య బాబుకి నంది అవార్డ్ ని తెచ్చి పెట్టింది. 

ఈ సినిమాలో నయనతార పోషించిన పాత్రకు మొదట మమతా మోహన్ దాస్ అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత నయనతారను తీసుకున్నారు. 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."