Politics

ముఖేష్ అంబానీ రోజువారీ ఆదాయం ఎంతో తెలుసా ?

మనదేశంలో పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు. మధ్య తరగతి ప్రజలు ఎక్కువే. అయితే బడా పారిశ్రామిక వేత్తలకు కొదవలేదు. ఒకప్పుడు టాటా ,బిర్లాల పేర్లే వినిపించేవి. కానీ ఇప్పుడు చాలామంది బిగ్ ఇండస్ట్రియలిస్ట్స్ జాబితాలో చేరిపోయారు. అంతేకాదు ఇండియాలోనే అత్యంత భారీ ఆదాయం గల కుబేరులుగా మారిపోయారు. ఈ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ ఒకరు. ఈయన చేసే బిజినెస్ లు చూస్తే,ఆదాయం కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. అది నిజం కూడా. గత ఏడాది ఆయన రోజువారీ ఆదాయం చూస్తే, అక్షరాలా 300కోట్లు అని తేలింది. ఈయన మొత్తం ఆస్తి 3లక్షల 71కోట్ల రూపాయలు. ఫలితంగా ఈ ఏడాది కూడా ముఖేష్ ఈ ఏడాది కూడా నెంబర్ కుబేరునిగా కంటిన్యూ అవుతున్నారు.

భారత్ క్లేన్ హ్యూరస్ సంస్థ 2018సంవత్సరానికి దేశంలోని అంత్యంత కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో మొదటి జాబితాలో అంబానీ ఫామిలీ నిల్చింది. గోద్రెజ్ ,మిస్త్రీజీ,సంఘ్వీ,నాడార్, అదానీ,దామని,లోహియా,బూర్మాన్ లు ఉన్నారు.అంత్యంత కుబేరుల జాబితాలో ఒక లక్షా 59వేలకోట్లతో హిందుజా రెండవ స్థానంలో నిల్చింది.

అలాగే ఒక లక్షా 14వేల 500కోట్లతో ఎల్ ఎస్ మిట్టల్ మూడవ స్థానంలో ఉంటె,96వేలకోట్ల రూపాయలతో అజీమ్ ప్రేమ్ జి నాల్గవ స్థానంలో ఉన్నారు. ఇక వెయ్యి కోట్ల రూపాయల కన్నా ఎక్కువ సంపాదన ఉన్నవారు 2017లెక్కల ప్రకారం 617మంది ఉంటె,ఈ ఏడాది 831మందికి చేరినట్లు తాజా సర్వే చెబుతోంది.

రూపాయి విలువ పతనమవుతున్న, ముడి చమురు ధరలు పెరుతుండడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం భారత్ లో సంపద సృష్టి రేటు అనూహ్యంగా పెరిగిపోతోందని సర్వే నివేదిక తేటతెల్లంచేసింది. అదేసమయంలో పేద,మధ్య తరగతి ప్రజల ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయని మరో నివేదిక చెబుతోంది.