Movies

దేవదాసు సినిమాతో సంచలనం సృష్టిస్తున్న రష్మిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఒక్కొక్కరు ఎంట్రీ ఇచ్చిన వేళా విశేషమో ఏమో గానీ వారికి ఇక తిరుగుండదు అంటారు. అలా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన వరుస విజయాలతో దూసుకుపోతోంది. కేవలం రెండు మూడు సినిమాలకే ఈ బక్క పలచని భామ పేరు మరోమోగిపోతోంది. స్లిమ్ అందాలు గల ఈ భామకు గోల్డెన్ లెగ్ అనే పేరు వచ్చేసింది. ఈమె మొదటి చిత్రం ఛలో పర్వాలేదనిపించింది. అయితే విజయ్ దేవర కొండతో గీతా గోవిందం చిత్రం చేసిన రష్మిక కెరీర్ వేగంగా మలుపు తిరిగింది. అందుకే దేవదాస్ చిత్రంలో నాని ఈ భామను ఎంపిక చేసుకున్నాడు. ఇక దేవదాస్ కూడా సూపర్ టాక్ వచ్చేయడంతో ఇండస్ట్రీ దృష్టి ఈ అమ్మడి మీద పడింది. చూడగానే ఆకట్టుకునే ముఖ వర్చసు,పక్కింటి అమ్మాయిలా ఉండే తీరు ఈమెను తెలుగులో ఎంట్రీతోనే హ్యాట్రిక్ దిశగా నడిపించింది.

కేవలం 22 ఏళ్లకే తెలుగులో స్టార్ స్టేటస్ కొట్టేసిన రష్మిక 1996 ఏప్రియల్ 5న కర్ణాటకలోని విరాజ్ పేటలో మదన్ మందాన, సుమనా మదన దంపతులకు పుట్టింది. ఈమెకు ఓ సోదరుడు, ఓ చెల్లి ఉన్నారు. సోదరుడు ధర్మ వైజాగ్ సన్ ఇనిస్టిట్యూట్ లో ఈజీ బీఎస్సీ చదువుతుండగా, చెల్లెలు షిమా 5వ తరగతి చదువుతోంది.

రష్మిక కూర్ పబ్లిక్ స్కూల్ లో ప్రాధమిక విద్యాభ్యాసం చేసి,మైసూర్ లో ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తిచేసింది. ఎం ఎస్ రామయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇంగ్లీషు లిటరేచర్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. కాలేజ్ డేస్ లోనే ఒకటి రెండు యాడ్స్ చేసిన ఈమె తన బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టితో కల్సి కిరికిపాటి సినిమాతో తొలిసారి వెండితెరపై మెరిసింది. ఈ మూవీ సాధించిన అనూహ్య విజయంతో ఈ అమ్మడి పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

ఆ తర్వాత ఛలో మూవీ లో నాగసూర్యతో కల్సి నటించి,తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అర్జున్ రెడ్డి విజయంతో మాంచి ఊపు మీదున్న విజయ్ దేవరకొండతో కల్సి గీతగోవిందం లో నటించి, తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ మూవీలో విజయ్ తో కెమిస్ట్రీ వర్కవుట్ కావడంతో ఎవరి సరసనైనా రాణిస్తుందన్న పేరు వచ్చేసింది. దీంతో తాజాగా దేవదాస్ మూవీలో నానితో కట్టిన జోడి మరో విజయాన్ని అందించింది.

ఇక విజయ్ దేవరకొండతో మరోసారి జతకడుతూ డియర్ కామ్రేడ్ అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో నటిస్తోంది. ఇది కూడా హిట్ కొడితే రష్మిక టాప్ రేంజ్ కి చేరుకోవడం ఖాయం. ఇక మరోపక్క ఆమె ప్రియుడు రక్షిత్ తో లవ్ ఫెయిల్ అయిన విషయం రష్మిక ప్రకటించడమే కాదు, అతడు కూడా డిక్లేరు చేసేసాడు. వీళ్ళ లవ్ బెడిసి కొట్టడానికి కారణం ఆమె మేనేజర్లే.

నిజానికి రక్షిత్ తో గీతా గోవిందం మూవీకి ముందే మ్యారేజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఏకంగా వంద కోట్ల సినిమాగా పేరు రావడంతో ఆమెకు క్రేజ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఇక నీకు తిరుగులేదని,ఇలాంటి సమయంలో పెళ్లి అడ్డంకి అవుతుందని మేనేజర్లు నూరిపోయడంతో పాపం ఈ అమ్మడు లవ్ కి బ్రేక్ అప్ ఇచ్చేసింది.