Movies

‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ పాట ఎవరు రాసారు… ఎలా వచ్చింది… కొన్ని ఆసక్తికరమైన విషయాలు

పుట్టినరోజు వచ్చిందంటే చాలు ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అంటూ పాట పాడేస్తాం. ఈ పాట తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి ముసలి వారి వరకు అందరు పాడుతూ ఉంటారు. అసలు ఈ పాట ఎలా వచ్చింది? ఎవరు రాసారు? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అనే పాటను వంద సంవత్సరాల క్రితం 1893లో రాసారు. ఈ పాట గుడ్ మార్నింగ్ టు ఆల్ అనే పాట నుంచి వచ్చింది.

ఈ పాటను మొదటిసారిగా అమెరికా స్కూల్ లో పాడారు. చిన్నారులకు సులభంగా ఉంటుందని గుడ్ మార్నింగ్ టు ఆల్ అనే మాటల్ని పాటగా మార్చారు. దాని తర్వాత.. గుడ్ మార్నింగ్ నుంచి.. హ్యాపీ బర్త్ డేకి మారింది. ఇంగ్లీష్ భాషలోని అన్ని పాటల్లో కంటే హ్యాపీ బర్త్ డే సాంగే ఫేమస్.

ఈ పాటను చాలా సినిమాల్లో కూడా చూసాం. అయితే వార్నర్ మ్యూజిక్ సంస్థ ఈ పాటపై మాకు కాపీ రైట్ ఉందని కోర్టుకి వెళ్ళింది. ఓ సినిమా ప్రొడ్యూసర్ కీ.. వార్నర్ మ్యూజిక్ సంస్థకీ మధ్య రెండేళ్లు ఫైట్ నడిచింది. ఆ సినిమాలో హ్యాపీ బర్త్ డే పాట వాడాలంటే.. తమకి డబ్బివ్వాల్సిందే అని డిమాండ్ చేసింది వార్నర్ సంస్థ. అయితే.. వార్నర్ చాపెల్ మ్యూజిక్ కి కాపీ రైట్స్ లేవంటూ.. తీర్పు ఫైనల్ చేసింది.. ఫెడరల్ కోర్టు. అంతేకాదు హ్యాపీ బర్త్ డే పాటను అందరూ పాడుకోవచ్చని తీర్పు ఇచ్చింది.