Devotional

దసరా నవరాత్రులలో తొమ్మిదో రోజు అలంకరణ… నైవేద్యం ఏమిటో తెలుసా?

తొమ్మిదో రోజు – రాజరాజేశ్వరీ దేవి అలంకారం
శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చెయ్యలేడని శివునికి యొక్క శక్తి రూపమే ”దుర్గ” అని ఆదిశంకరాచార్యులు చెప్పారు. మన పురాణాల్లో దుర్గాదేవి రాత్రి రూపం గలదని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడని చెప్పబడింది. అందుచేత శివునికి అర్ధాంగిగా పూజలందుకుంటున్న మహేశ్వరిని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో పూజిస్తే .. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఎర్రటి బట్టలను ధరించి అమ్మవారిని ఎర్రటి పువ్వులు,పసుపు,కుంకుమలతో పూజ చేయాలి. సాయంత్రం ఆరు గంటలకు పూజ ప్రారంభించాలి. దీపారాధనకు తొమ్మిది వత్తులతో దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. పొంగలి,పులిహోర,అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలి. రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే…”శ్రీ మాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దసరా రోజున ఏ పని మొదలు పెట్టిన విజయవంతం అవుతుంది.