Devotional

దసరా నవరాత్రులలో అయిదో రోజు అలంకరణ… నైవేద్యం ఏమిటో తెలుసా?

అయిదో రోజు – లలితా త్రిపురసుందరి అలంకారం

త్రిపురత్రయంలో రెండో శక్తి లలితా త్రిపుర సుందరి. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరీ స్వరూపం ఈ తల్లి. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపుర సుందరిని ఆరాధిస్తారు. చెరుకుగడ, విల్లు, పాశాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాలను అందిస్తుంది. కుంకుమతో ఆ అమ్మవారిని పూజిస్తే మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. ”ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.