Devotional

దసరా నవరాత్రులలో నాలుగో రోజు అలంకరణ… నైవేద్యం ఏమిటో తెలుసా?

నాలుగోరోజు – కాత్యాయ‌ని దేవి అలంకారం

కతుడు అనే మహర్షి కడుపున పుట్టిన అమ్మే కాత్యాయని అనీ, ఆమె పరమేశ్వరుడి అర్థాంగిగా ప్రత్యేకత అందుకుందని పురాణాలు చెబుతున్నాయి. భాగవతంలో గోపికలు నిర్మలమైన ప్రేమతో శ్రీకృష్ణుడే భర్తగా కావాలని కాత్యాయనీ వ్రతం చేశారు. అంటే గృహస్థ జీవితంలో మహిళకి ఉన్న ప్రాధాన్యాన్ని కాత్యాయిని తెలియజేస్తుంది. బాధ్యత, ప్రవర్తన, ఓర్పు, నేర్పుల ఆధారంగా వైవాహిక జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఓర్పు నేర్పులన్నీ కాత్యాయనీ స్వరూపాలే.