Movies

బొంబాయి సినిమాలో నటించిన ఈ చిన్నారులను గుర్తు పట్టారా… ఇప్పుడు వీరు ఏమి చేస్తున్నారో తెలుసా?

కొన్ని సినిమాలు ఎప్పటికీ సెన్షేషన్ గానే మిగిలిపోతాయి. అలాంటి సినిమాల్లో మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి మూవీ ఒకటి. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ మూవీ రొమాంటికి క్లాసికల్ మూవీగా, మ్యూజికల్ హిట్ గా నిల్చింది. మతకలహాలు నేపథ్యంలో తీసిన ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే ఇబ్బందులు ఎదుర్కొంది. చివరికి ఈ మూవీని బొంబాయిలో కేవలం మూడు రోజులే షూట్ చేసారు. మిగతాది అంతా చెన్నై స్టూడియాలో ముంబయి సెట్ వేసి తీశారు. మనిషా కొయిరాలా,అరవింద్ స్వామి జంటగా వచ్చిన ఈ మూవీ దేశాన్ని ఓ ఊపు ఊపేసింది.
Harsha Yallapragada
రోజా తర్వాత మణిరత్నం తీసిన ఈ మూవీలో అరవింద్ స్వామి కంటిన్యూ అయ్యాడు. బొంబాయి సినిమా షూటింగ్ మొదలు నుంచి రిలీజ్ వరకూ వివాదాలు నడిచాయి. సినిమా వచ్చాక కూడా దేశమంతా చాలాచోట్ల చర్చా గోష్టులు జరిగాయి. ఇక హీరోహీరోయిన్స్ తో పాటు కీలక రోల్స్ పోషించిన ట్విన్స్ కూడా ఉన్నారు.
Hriday Yallapragada
ఈ చిన్నారుల నటన ఆడియన్స్ ని ఉద్వేగానికి గురిచేసింది. కమల్ బషీర్,కబీరు నారాయణ్ పాత్రల కోసం దాదాపు 70ట్విన్స్ ని స్క్రీన్ టెస్ట్ చేసాక చివరికి తెలుగు ప్రాంతానికి చెందిన హృదయ్ ఎల్లాప్రగడ,హర్ష ఎల్లాప్రగడ లను సెలెక్ట్ చేసారు.
Manisha Koirala
హీరో హీరోయిన్స్ పిల్లలుగా నటించిన ఈ జంట నిజానికి అచ్చమైన తెలుగు కుటుంబానికి చెందిన వారన్న సంగతి చాలామందికి తెలియదు. మొత్తానికి ఈ సినిమాతో ఈజంట ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశారు. ఆతర్వాత వీరిద్దరికీ వరుస ఆఫర్స్ వచ్చిపడ్డాయి. అయితే స్టడీస్ దెబ్బతింటాయన్న ఉద్దేశ్యంతో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు.

అయితే ఈ ట్విన్స్ లో ఒకడైన హృదయ్ మాత్రం ఆతర్వాత ఒక సినిమాలో వేసాడు. ప్రేమించుకుందాం రా మూవీలో వెంకటేష్ మేనల్లుడు పాత్రలో నటించాడు. ఆతర్వాత యుఎస్ లో స్టడీస్ పూర్తిచేసుకున్న హృదయ్ సినిమాల మీద ఇష్టంతో యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందాడు. ఇక అతని తమ్ముడు హర్ష అయితే స్టడీస్ కి యుఎస్ వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు.

హృదయ్ సినిమాల్లో ఛాన్స్ కోసం చాలా కాలం చూసి చూసి చివరకు కోలీవుడ్ లో కొంచెం కాఫీ,కొంచెం కాదల్ మూవీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అది కాస్తా చతికిల బడ్డంతో ఎక్కడా ఛాన్స్ లు రాలేదు. గత్యంతరం లేక యుఎస్ వెళ్ళిపోయి ఉద్యోగంలో స్థిరపడ్డాడు.