Politics

పేపర్స్,మీడియా పవన్ ని ఎందుకు సపోర్ట్ చేయటం లేదు… కారణాలు ఇవే?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన యాత్రల ద్వారా జనంలోకి దూసుకెళ్తుంటే, మరోపక్క పవన్ కి జనంలో వస్తున్న ఆదరణ చూసి, వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులూ,కార్యకర్తలూ జనసేన గూటికి చేరుతున్నారు. పశ్చిమ గోదావరిలో యూత్ పవన్ కి పట్టిన బ్రహ్మరధం మిగిలిన పక్షాలను కలవర పరుస్తోంది. అయితే పవన్ ని ఏదోవిధంగా అడ్డుకోడానికి కొన్ని శక్తులు,ముఖ్యంగా మీడియా సంస్థలు స్ట్రింగ్ ఆపరేషన్స్ చేస్తూ,లేనిపోని వార్తలతో దెబ్బతీసే చర్యలకు దిగుతున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ చరిష్మాను ఇలాంటి వార్తలు ఏమీ చేయలేవని,పవన్ ప్రభంజనం ముందు ఇలాంటివి దిగదుడుపేనని అంటున్నారు.

అయితే ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాల్లో పవన్ పూజలు చేసిన ఘటనను క్షుద్ర పూజలు చేసినట్లు వార్త ఇండస్ట్రీలో వైరల్ అయింది. దీంతో పవన్ కళ్యాణ్ మండిపడుతూ మాములుగా పూజలు జరిపిస్తే,ఇలా వక్రీకరిస్తున్నారని మీడియాపై ఫైర్ అయ్యారు. జంగారెడ్డిగూడెం సభలో అయన మాట్లాడుతూ తాను ఎక్కడికైనా వెళ్లి పూజలు చేస్తే,క్షుద్ర పూజలు అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఇక్కడ ఆయన ఓ సంఘటనను ఉదహరిస్తూ,జనసేనకు ఓ పాప 1350 రూపాయలు విరాళం ఇవ్వబోతే,తాను కేవలం 11రూపాయలు కాయిన్స్ స్వీకరిస్తే,పవన్ ఓ పాప దగ్గర 11రూపాయలు కొట్టేశాడని వార్తలు కూడా వచ్చే రోజు దగ్గరలోనే ఉందని మీడియా పోకడపై సెటైర్ విసిరారు.
నిజానికి పవన్ నవ్వుకోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ, తనపై మీడియా ఎంతగా వ్యతిరేకంగా వ్యవహరిస్తోందో ననే ఆందోళన పవన్ లో కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

తనకు పేరుమోసిన పేపర్లు, చానల్స్ లేవని,తనకు ఫేస్ బుక్,ట్విట్టర్,వంటివే తనకు ప్రచార సాధనాలని పవన్ పేర్కొంటూ,పార్టీమీద,తనమీద వచ్చే ఇలాంటి వ్యతిరేక ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా తిప్పి కొట్టాలని సూచిస్తున్నారు పవన్. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువ సీట్లు గెలవడం ద్వారా సత్తా చాటాలని జనసేన భావిస్తోంది. చూద్దాం ఏమి జరుగుతుందో.