Movies

‘మిర్చి’ సినిమాలోని ఈమెను గుర్తుపట్టారా..?ఈమె సొంతంగాఎలాంటి Business చేస్తుందో తెలుసా?

ఒక సినిమా తీయాలంటే హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు ,విలన్,కమెడియన్స్,సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ ఇలా అందరూ ఉండాలి. ఇందులో ఎవరు లేకున్నా రక్తి కట్టదు. ఎవరికివారే ఇంపార్టెన్స్ కదా. ఇక సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ ఒక్కోసారి కీలకం అవుతారు. వాళ్ళ ఇమేజి అలాంటిది. తల్లి,అక్క, భార్య,వదిన,మరదలు,అత్తా,ఇలా అన్ని పాత్రలు ఉండేది కొద్దిసేపే కావచ్చు ఫ్రేమ్ లో వాళ్ళే కీలకం. ఇక హీరో హీరోయిన్స్ అయితే రెండు మూడు సినిమాలు మించి వుండవు. సపోర్టింగ్ ఆర్టిస్టులు అయితే డజన్ల కొద్దీ సినిమాల్లో నటించేస్తారు. అందుకే వీళ్ళ కాల్ షీట్స్ దొరకడం కష్టం.
ఇలా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా రాణించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒకే ఒక సినిమాతో స్టార్ యాక్ట్రెస్ మారిపోయిన మాధవి విషయం తీసుకుంటే చాలు. మిర్చి మూవీలో ఈమె వేసిన క్యారెక్టర్ జనంలోకి దూసుకుపోయింది.

నిజానికి సాదా సీదాగా జీవితం సాగిస్తున్న ఈమె జీవితంలోకి సినిమా అనేది అనుకోకుండా ఎంటర్ అయింది. ఈమె సినిమాల్లో ప్రవేశించడానికి అదృష్టం ఎలా తలుపు తట్టిందంటే, ఈమె బుల్లితెరపై నటించడమే కారణం. ఈమె ముందుగా జెమినిలో ప్రసారం అయిన త్రిసూలం సీరియల్ లో లీడ్ రోల్ వేసింది. వాస్తవానికి మాధవికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. ఆమె భర్త ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఈమె సినిమాల్లోకి అడుగుపెట్టకముందు ఈమె వాళ్ళ సొంతకంపెనీ పినాకిల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ సెంటర్ ని పెట్టి,ఎంతోమంది యువతీయువకులకు సాఫ్ట్ స్కిల్స్,వ్యక్తిత్వ వికాసం మీద శిక్షణ ఇస్తున్నారు.

ఎం బి ఏ చదివిన ఈమె ఓ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ కూడా. ఇక ఆ మధ్య ఓ ఇంటర్యూలో ‘మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎవరైనా వాడుకున్నారా’అని అడిగేసరికి మాధవి కోపంతో ఊగిపోతూ,మీకు ఇంటర్యూ చేయడం రాకపోతే మానుకో ,ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతావా’అంటూ చెడా మడా తిట్టేసి అక్కడ నుంచి వెళ్లిపోయిందట. తొలి సీరియల్ లోనే మంచి పేరు , గుర్తింపు వచ్చేయడంతో బుల్లితెరపై మాధవి బిజీ ఆర్టిస్ట్ అయిపొయింది. ఇక ఒంటరి మూవీలో సపోర్టింగ్ యాక్టర్ గా నటించే ఛాన్స్ వరించింది. ఇక వెనక్కి తిరిగిచూడలేదు. ఏకంగా 95చిత్రాల్లో నటించేసింది. సపోర్టింగ్ రోల్స్ లో బిజీగా మారిపోయిన ఈమె వయస్సు చిన్నదే అయినా హీరోలకు తల్లిగా నటిస్తోంది.

‘హండ్రెడ్ పర్సెంట్ లవ్,శతమానం భవతి,శమంతకమణి,రేసుగుర్రం,వంటి సినిమాల్లో ఈమె నటన అద్భుతం. మిర్చి మూవీలో ఫాతిమా పాత్రలో ఈమె జీవించింది. భర్తను పోగొట్టుకుని కొడుకుని సరైన దారిలో పెట్టడానికి అయ్యా అయ్యా అని దీనంగా ఆత్మహత్య చేసుకునే పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఆ సినిమాలో ఆ సన్నివేశం కీలకం. అందుకే మాధవి ఇంటిపేరు ఆ సినిమాతో మిర్చి మాధవి గా మారిపోయింది.