Movies

పవన్ కళ్యాణ్ వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు

సినీ రంగంలో హిట్ లేదా ప్లాప్ అనేది ప్రతి నటుడికి అనుభవంలోకి రావటం సహజమే. స్టార్స్ స్క్రిప్ట్ ని ఎంపిక చేసుకొనే సమయంలో కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తిరస్కరించిన ఒక సినిమాలో రవితేజ నటించాడు. ఆ సినిమా రవితేజను స్టార్ ని చేసింది. పవన్ కళ్యాణ్ తిరస్కరించిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. హీరోలు తీరిక లేని షెడ్యుల్ కారణంగా కొన్ని సినిమాలను వదులుకోవటం జరుగుతుంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ తిరస్కరించిన సూపర్ హిట్ సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.

1. ఇడియట్

ఈ సినిమాను మొదట పూరీ జగన్నాధ్ పవన్ కళ్యాణ్,సుమంత్ లకు వినిపించాడు. కానీ వారు తిరస్కరించటంతో పూరీ రవితేజ దగ్గరకు వెళ్ళాడు. రవితేజ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని హీరోగా మారాడు. ఈ సినిమా 2002 లో విడుదల అయ్యింది.

2. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
amma nanna o tamil ammayi
ఈ సినిమాని కూడా పవన్ కళ్యాణ్ తిరస్కరించాడు. ఈ సినిమాకి దర్శకుడు అయిన పూరీ జగన్నాధ్ రవితేజతో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా 2003 లో విడుదల అయింది.

3. అతడు

ఈ సినిమా కూడా మొదట పవన్ కళ్యాణ్ వద్దకే వెళ్ళింది. పవన్ తిరస్కరించటంతో మహేష్ బాబు వద్దకు వెళ్ళింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా 2005 లో విడుదల అయ్యింది.

4. పోకిరి

ఈ సినిమా కూడా మొదట పవన్ కళ్యాణ్ వద్దకే వెళ్ళింది. ఆ తర్వాత మహేష్ చేతిలోకి వెళ్ళింది. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో అనేక రికార్డులను బద్దలు కొట్టి ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా మారింది. ఇది 2006 లో విడుదలైంది.

5. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

ఈ సినిమాలో మొదట మహేష్ బాబు పాత్రకు పవన్ కళ్యాణ్ ని అడిగారు. కానీ పవన్ కాదని చెప్పటంతో మహేష్ బాబు వద్దకు వచ్చింది. 2013 లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.