Movies

ఈ టివి నటిని గుర్తు పట్టారా…సన కొడుకుని పెళ్లాడిన ఈమె పరిస్థితి ఇప్పుడెలా ఉందో చూడండి

వెండితెరమీదే కాదు బుల్లితెరమీద కూడా తమ అందం, అభినయం తో వెలుగొందేవాళ్ళూ ఉన్నారు. అందులో బబ్లీ స్టార్ గాళ్ సమీరా షరీఫ్ ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులకు తన ఫెర్మారెన్స్ తో బాగా దగ్గరైన ఈమె 17ఏళ్ళ ప్రాయంలోనే టివి రంగంలో అడుగుపెట్టింది. ఆడపిల్ల,మనసు మమత,ప్రతిబింబం,మంగమ్మగారి మనవరాలు,భార్యామణి ముద్దుబిడ్డ వంటి సీరియల్స్ తో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకున్న సమీరా సొంతూరు హైదరాబాద్. స్కూల్ డేస్ లో స్పోర్ట్స్ లో ప్రావిణ్యం సంపాందించిన సమీరా క్రికెట్ , వాలీబాల్ లలో బాగా రాణించేది. జిల్లా స్థాయి క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది.

మంచి స్పోర్ట్స్ మెన్ అవ్వాలని,లేకుంటే రాజకీయాల్లో చేరి,సీఎం అవ్వాలని లక్ష్యంగా ఉండేదట. ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఉంటె త్వరగా పేరుతెచ్చుకోవచ్చని,అపుడు పాలిటిక్స్ లోకి వెళ్తే బాగుంటుందని తండ్రి చేసిన సూచనతో నటన రంగంలో అడుగువేసింది. తెలుగులో టివి సీరియల్స్ లో సీనియర్ నటి సన తో కల్సి నటిస్తుండగా, సమీరాకు ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓసారి షాపింగ్ మాల్ లో సమీరాకు సయ్యద్ అన్వర్ ఆలీ అనే కుర్రాడు తారస పడ్డాడు. మీ అభిమానినని,మీ నటన చాలా ఇష్టం అంటూ సమీరాతో అతడు సెల్ఫీ దిగాడు.

అంతవరకూ బానే వుంది. ఓరోజు సన తన కొడుకు సెల్ ఫోన్ లో సమీరాతో కల్సిన ఫోటో చూడ్డంతో ఈ విషయాన్ని సమీరాతో చెప్పింది. తనతో సెల్ఫీ దిగింది సన కొడుకేనని తెల్సి సమీరా షాకయ్యింది. అలా సమీరా, అన్వర్ ల మధ్య ప్రేమాయణం స్టార్ట్ అయింది. ఇక ఇద్దరూ కల్సి తమిళ సీరియల్ పాగల్ నెలవు ద్వారా హిట్ జంటగా పేరుకూడా తెచ్చుకున్నారు. అనుకోకుండా ఆ సీరియల్ లో భాగంగా అన్వర్ తనకు తాళికట్టే సీను రావడంతో సమీరా ఎమోషన్ కి గురయ్యి గట్టిగా ఏడ్చేసిందట.

వాళ్లిద్దరూ లవర్స్ అని తెలియక యూనిట్ సభ్యులు షాకయ్యారట. నిజానికి సోషల్ మీడియాలో ఇద్దరి ఫోటో చూసిన సీరియల్ ప్రొడ్యూసర్స్ ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఆతర్వాత పెళ్లి కూడా జరిగిపోయింది. సమీరాకు ఓ కొడుకు పుట్టాడు. అయితే సమీరా జీవితంలో మరో ఘటన విషయానికి వెళ్తే, ఆడపిల్ల టివి సీరియల్ ఆడిషన్స్ జరుగుతుంటే, 500మంది అమ్మాయిలు హాజరయితే అందులో సమీరా కూడా ఉంది. అందరినీ టెస్ట్ చేసి సమీరను సెలెక్ట్ చేసారు.

అలా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇక వెనక్కి తిరిగి చూడలేదు. పైగా టివి నటుడు,యాంకర్ ప్రభాకర్ తో ఏర్పడిన పరిచయం కొత్తమలుపు తిప్పింది. అతడి ఎంకరేజ్ మెంట్ తో అనేక సీరియల్స్ లో నటించిన సమీరా ఆతర్వాత రూమర్స్ ఎదుర్కొంది. అప్పటికే పెళ్లయిన ప్రభాకర్ తో ఆమెకు ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు రావడంతో దుమారం రేగింది.

ప్రభాకర్ ఫ్యామిలిలో కూడా కలతలు వచ్చాయని ఊహాగానాలు చెలరేగడంతో కొన్నాళ్ళు సీరియల్స్ కి దూరం అయింది. కొద్దికాలానికే మళ్ళీ ఎంటర్ అవ్వడం,అన్వర్ తో పరిచయం,పెళ్లి ఆతర్వాత సంతానం ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. భర్త ఎంకరేజ్ మెంట్ తో మరో సీరియల్ లో సమీరా నటిస్తోంది. తమిళంలో వస్తున్న ఈ సీరియల్ కి సమీరా, అన్వర్ లు ప్రొడ్యూసర్స్ .