Movies

అందాల రాక్షసి సినిమాలో నటించిన నవీన్ చంద్ర గుర్తు ఉన్నాడా…. ఎన్టీఆర్ కి నవీన్ చంద్రకి లింక్ ఏమిటో తెలుసా?

మనం ఎవరికైనా సాయం చేస్తే, మనకు కూడా ఎవరైనా సాయం చేస్తారన్న కాన్సెప్ట్ ని బాగానే వంటబట్టించుకున్నాడు యువ హీరో నవీన్ చంద్ర. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు వస్తున్న సందర్భంలోనే పర్సనల్ మ్యాకప్ మాన్ కి ప్రమాదం జరిగి,కాలు తీసే పరిస్థితి ఏర్పడడంతో తనదగ్గర డబ్బులు లేకున్నా సరే , అప్పులు చేసి మరీ ట్రీట్ మెంట్ ఇప్పించాడట. మనం సాయం చేస్తే, మనకు కూడా ఇతరులు సాయం చేస్తారని అతడు చెబుతూ,అందుకే సాధ్యమైనంత వరకూ ఇతరులకు సాయం చేయడంలో వెనుకాడనని అంటున్నాడు. ఇంతకీ నవీన్ చంద్ర ఇప్పుడు తారక్ మూవీ ‘అరవింద సమేత ..’మూవీలో చేస్తున్నాడు. ఇతని నటన చూసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొగిడేసాడు.

చిన్న చిన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నందున కొత్త నటీనటులు వస్తున్నారు. పెద్ద హీరోలకు ధీటుగా నటనలో దున్నేస్తున్నారు. కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి. ఇక అదేకోవలో ఒడ్డూ పొడుగు ఉన్న నవీన్ చంద్ర అందాల రాక్షసి సినిమాతో తానేమిటో రుజువుచేసుకున్నాడు. ఇక ఇప్పుడు అరవింద సమేత లో విలన్ రోల్ వేస్తున్నాడు. నిజానికి తారక్ ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడడు. కానీ అరవింద సమేత సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో’అందాల రాక్షసి మూవీలో అతడి నటన బాగుంది.

ఇప్పుడు అరవింద సమేత లో చేసిన నటన చూసి గొప్ప నటుడని తెలుసుకున్నాను. హేట్సాఫ్’ అంటూ నవీన్ చంద్ర గురించి వీరలెవెల్లో ప్రశంసలు కురిపించడం అందరినీ షాక్ కి గురిచేసింది. కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతానికి చెందిన నవీన్ చంద్ర ఫామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. అందుకే చిన్ననాటి నుంచీ కష్టసుఖాలు ఎలా వుంటాయో తెలుసున్న యితడు పదవ తరగతి చదువుతుండగా తండ్రి మరణించాడు.

దీంతో అతని కుటుంబం దిక్కులేనిదిగా మారడంతో చదువు కొనసాగించాలా లేదా అనే సందేహం నడుమ మొత్తానికి స్టడీస్ పూర్తిచేసి హైదరాబాద్ లోని అమీర్ పేటకు వచ్చి, పలు రకాల ఉద్యోగాలు చేసి వచ్చిన సొమ్ముతో ఓ సోదరి పెళ్లి చేసాడు. మల్టీ మీడియా సంస్థలో ఫ్యాకల్టీగా చేస్తున్న రోజుల్లో అశోక్ నాయుడు అనే వ్యక్తి పరిచయం కావడంతో అతని జీవితం టర్న్ అయింది. ఒకరికొకరు తండ్రే కొడుకులుగా భావించుకున్నారు. అశోక్ నాయుడు ఇచ్చిన గైడెన్స్ కారణంగా ‘సంభవామి యుగే యుగే’ మూవీలో ఛాన్స్ తగిలింది.

అయితే ఆ మూవీ హిట్ కాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి చేరుకొని, ప్రదీప్ అనే పేరుతొ నటించి పేరుతెచ్చుకున్నాడు. మరోసారి తెలుగులో కూడా నటించాలని చేసిన ప్రయత్నం ‘అందాల రాక్షసి’రూపంలో ఫలించి,మంచి బ్రేక్ ఇచ్చింది. త్రిపుర, లచ్చిందేవి కి ఓ లక్కు వంటి మూవీస్ తో స్టార్ అయ్యాడు. నేను లోకల్ మూవీలో నెగెటివ్ రోల్ వేసినప్పటికీ హీరో నానికి ఎంతపేరు వచ్చిందో సరిసమానంగా నవీన్ చంద్రకు క్రేజ్ వచ్చింది . ఇక ఆ తరవాత దేవదాస్, అరవింద సమేత మూవీస్ లో ముఖ్య పాత్రలు వచ్చాయి.

సంభవామి యుగే యుగే మూవీలో నటిస్తున్నప్పుడు షెల్టర్ లేకపోతె ,ఆ మూవీ రైటర్ లక్ష్మీ భూపాల్ ఇంట్లోని పెంట్ హౌస్ లో నవీన్ ఉన్నాడట. ఆసమయంలో ఏడాది పాటు సొంత కొడుకులా నవీన్ ని లక్షీ భూపాల్ చూసున్నాడట. అందుకే తాను పడ్డ కష్టాన్ని మరిచిపోకుండా తన చేతనైనంత మేరకు ఇతరులను ఆదుకునే విధంగా నవీన్ చంద్ర అడుగులు వేస్తున్నాడు.