Movies

హీరో పృద్వి రాజ్ గుర్తు ఉన్నాడా…. ఇప్పుడు ఎంత మంచి పని చేస్తున్నాడో తెలిస్తే గ్రేట్ అంటారు

సినిమాకు కథే ప్రాణం .. హీరో తో సంబంధం లేదు .. అని చాలామంది అనడం వింటుంటాం. ఇక కొన్ని సినిమాలను హీరో హీరోయిన్స్ తో పనిలేకుండా కథాపరంగా సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలూ ఎన్నో ఉన్నాయి. ఇక కథ పరంగా కొన్ని పాత్రలకు విశేష గుర్తింపు కూడా వస్తుంది. అలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృథ్వి. ఎన్నో చిత్రాల్లో అలరించిన పృథ్వి జీవితంలో ఎదురైనా సమస్యలను తట్టుకోలేక ఎన్నోసార్లు ఆత్మహత్య కు ప్రయత్నించాడు. ఇక యితడు 1966 జులై18న బెంగుళూరులో జన్మించిన యితడు బాలనటుడిగా సినిమాల్లో నటించాడు. సినిమాలతో పాటు టివి సీరియల్స్ లో కూడా బాగా గుర్తింపు పొందాడు. 1994లో బినా అనే అమ్మాయితో పెళ్లయింది. వీరికి అహిద్ అనే కొడుకున్నాడు. అయితే అహిద్ ఆటిజం సమస్యతో బాధపడుతున్నాడు.

ఇతర పిల్లల్లా తన కొడుకు లేడనే ప్రశ్నతో కొడుకు పరిస్థితికి అనుక్షణం పృథ్వి బాధపడుతూనే ఉన్నాడు. దానికి తోడు సినిమాల్లో ఛాన్స్ లు తగ్గాయి. ఒకప్పుడు పిలిచి అవకాశాలు ఇచ్చినవాళ్లు సైతం, ఇప్పుడు అడిగినా ఛాన్స్ లు ఇవ్వలేదు. ఆర్ధిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో ఇక చావే శరణ్యం అనుకున్నాడు. అనేక విధాలా ఆత్మహత్యకు పాల్పడినా, భూమి మీద ఇంకా బతికే అవకాశం ఉండడంతో ఆత్మహత్య యత్నాలన్నీ బెడిసి కొట్టాయి.

అయితే ఆతరవాత నెమ్మదిగా కోలుకున్నాడు. ఇప్పుడు ఏకంగా జాక్ పాట్ లా ఎన్టీఆర్ బయోపిక్ లో ఛాన్స్ కొట్టేసాడు. బాలకృష్ణ పిలిచి మరీ ఈ మూవీలో అవకాశం ఇచ్చాడట. తానూ ఎన్టీఆర్ అభిమానినని, ఆయనతో ఒక్క సినిమా కూడా చేయలేకపోయాననే బాధ ఉండేదని,ఇప్పుడు ఆయన పేరిట తెరకెక్కిస్తున్న మూవీలో నటించే ఛాన్స్ రావడం ఆనందంగా ఉందని పృథ్వి అంటున్నాడు.

చిన్న పాత్రకోసం అడిగితె పెద్ద పాత్ర ఇచ్చి బాలకృష్ణ పెద్ద మనసు చాటుకున్నాడని, ఇది తన సెకండ్ ఇన్నింగ్స్ అని పృథ్వి ఆనందంతో ఉబ్బి తబ్బిబయ్యాడు. ఇక పృథ్వి తొలి ఇన్నింగ్స్ లోకి వెళ్తే,మనందరికీ బాగా గుర్తుండే సినిమా పెళ్లి. రెండు దశాబ్దాల కిందట వచ్చిన ఆ మూవీలో వడ్డే నవీన్,మహేశ్వరీ హీరో హీరోయిన్స్ అయినప్పటికీ నెగెటివ్ రోల్ వేసిన పృథ్వికి బాగా పేరొచ్చింది.

కథలో పట్టు ఉండడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో పృథ్వి పాత్ర కీలకం అవ్వడంతో ఆ సినిమా తర్వాత జెట్ స్పీడు లో దూసుకెళ్లాడు. నిజానికి దీనికన్నా ముందు తమిళంలో 20కి పైనే సినిమాల్లో నటించినా రానిపేరు ‘పెళ్లి’ తెలుగు మూవీతో వచ్చేసింది.
తెలుగులో పెళ్లిపందిరి,సమరసింహారెడ్డి, శ్రీమతి వెళ్ళొస్తా,ప్రేయసి రావే,సమ్మక్క సారక్క,దేవుళ్ళు వంటి మూవీస్ లో చేసిన యాక్షన్ ఆడియన్స్ హృదయాల్లో పృథ్వి చెరగని ముద్రవేసుకున్నాడు. కేరక్టర్ ఆర్టిస్టుగా నువ్వు నాకు నచ్చావ్,సంతోషం,గౌతమ్ ఎస్ ఎస్ సి వంటి మూవీస్ లో మంచి రోల్స్ వేసాడు.

ఇలా నటుడిగా ఎదిగిన పృథ్వికి పర్సనల్ లైఫ్ లో ఒడిడుకులు పృథ్విని కుంగదీశాయి. ఒకటా రెండా ఏకంగా 18సార్లు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రతిసారి బతికి బయటపడ్డాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఓ ఇంటర్యూలో చెప్పాడు. హైదరాబాద్ లోని దివ్యశక్తి అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ కూడా ఉండడంతో అక్కడ ఉన్నప్పుడు ఓసారి 14వ ఫ్లోర్ నుంచి దూకేసి చచ్చిపోదామని అనుకున్నాడు. ఆ సమయంలో తన ఆప్తుడు చేసిన ఫోన్ తో మనసు తేలికయిందని పృథ్వి చెప్పుకొచ్చాడు.

పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా ఏర్పడిన సమస్యలతో మానసికంగా నలిగిపోయానని చెప్పాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టానని,ముఖ్యంగా ఆత్మహత్యలకు పాల్పడవద్దని అందరిలో చైతన్యం నింపేవిధంగా షార్ట్ ఫిలిం తీయబోతున్నట్లు కూడా పృథ్వి చెబుతున్నాడు.