Movies

గుండు సుదర్శన్ గుండు వెనుక ఉన్న అసలు సీక్రెట్ తెలిస్తే సూపర్ ఐడియా అంటారు

సినిమా అనేది వినోదం… హాస్య ప్రధానంగా ఉంటె మరీ మంచిది. ఇక ఆరోగ్యకరమైన నవ్వు ఉంటె దాన్ని మించింది లేదు. అందుకే ‘నవ్వడం ఓ యోగం,నవ్వించడం భోగం ,నవ్వలేకపోవడం ఓ రోగం’అని జంధ్యాల ఎప్పుడో చెప్పారు. సినిమాల్లో నవ్వించడానికి కమెడియన్స్ కి కొదవలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే దాదాపు 70మంది కమెడియన్స్ టాలీవుడ్ లో ఉన్నారు. పొట్టచెక్కలయ్యేలా నవ్వించే సామర్ధ్యం ఉన్న హాస్య నటులే అందరూనూ. ఇక కమెడియన్స్ లో ఒక్కొక్కరిని చూస్తే చాలు నవ్వు వచ్చేసింది. ఆలాంటి నటుల్లో గుండు సుదర్శన్ ఒకరు. ఈయన చదువు రీత్యా మేధావి. మంచి ట్రైనర్ కూడా.

సుబ్బారావు, కనకలత దంపతులకు జన్మించిన గుండు సుదర్శన్ సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. తండ్రి లాయర్, తల్లి హౌస్ వైఫ్. గుండ్రాయి లాంటి నున్నని గుండుతో అలరించే గుండు సుదర్శన్ సినిమాల విషయానికి వస్తే,చిరునవ్వుతో మూవీలో హీరో ఇతడి క్యాప్ కోసం వెంటపడుతుంటే, అతన్ని తప్పించుకుంటూ సరదాగా కనిపిస్తాడు. ఇక ఖలేజా సినిమాలో టీ షాపులో హీరోయిన్ దగ్గర పలికే చిత్ర విచిత్ర డైలాగులు నవ్వు పుట్టిస్తాయి.

నిజానికి పదేళ్ల వయస్సులోనే నాటకాల్లో వేయడం మొదలుపెట్టిన గుండు సుదర్శన్ బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి,ఇంజనీరింగ్ లో పిహెచ్ డి చేసి డాక్టరేట్ అయ్యాడు. ఈయన భార్య విజయలక్ష్మి గృహిణి. వీరికి ఇద్దరు సంతానం. కూతురి పేరు హేమశ్రీ లత, కొడుకు పేరు శివ.
అంతే కాదు వార్తాపత్రికల్లో కాలమ్స్ రాసే గుండు సుదర్శన్ వ్యక్తిత్వ వికాసం,మోటివేషన్ మీద స్టూడెంట్స్ కి ,ప్రొఫెషనల్స్ కి శిక్షణ ఇస్తాడు.

ఎన్నో కాలేజీల్లో యూనివర్సిటీల్లో గెస్ట్ లెక్చర్ ఇచ్చాడు. మిస్టర్ పెళ్ళాం మూవీ ద్వారా నారద పాత్రలో తెలుగు వెండితెరపై కనిపించి,ప్రేక్షక హృదయాలను గెల్చుకున్నాడు. స్టూడెంట్ నెంబర్ వన్,కబడ్డీ కబడ్డీ,ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం,చిరునవ్వుతో,అతడు,మల్లీశ్వరి,దేశముదురు ,ఖలేజా,మనం,ఇలా ఎన్ని సినిమాల్లో స్టార్ హీరోలతో కల్సి నటించాడు.

దాదాపు 300సినిమాల్లో కమెడియన్ గా కనిపించి అదరగొట్టాడు. అహ నా పెళ్ళంట మూవీలో అరగుండుతో బ్రహ్మానందం నటించి స్టార్ కమెడియన్ అయ్యాడని,అలాంటిది తాను ఫుల్లు గుండుతో నటిస్తే,ఇంకెంత పేరు వస్తుందోనని ఇలా గుండుతో నటిస్తున్నానని సుదర్శన్ చెప్పే మాట.