Movies

అరవింద సమేత లోఎన్టీఆర్ తో జోడి కట్టిన ఈషా రెబ్బా బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘ అరవింద సమేత .. వీర రాఘవ’మూవీ పై హెవీ హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడమే. స్లిమ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో విశేషం ఈషా రెబ్బా కూడా నటిస్తోంది. ఈ మూవీతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరడం ఖాయమని ఈ అమ్మడు ఉవ్విళూరుతోంది. తమిళంతో ఈమె ‘ఓయూ’ అనే మూవీలో నటించడంతో ఆ సినిమా మంచి హిట్ అయింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కూడా కావడంతో ఈమె నటన చూసిన త్రివిక్రమ్ బాగా ఇంప్రెస్ అయ్యాడట.

విషయం ఎన్టీఆర్ చెవిన వేయడంతో అరవింద సమేతలో ఛాన్స్ ఇమ్మని సూచించాడట. ఆవిధంగా తారక్ పక్కన నటిస్తున్న ఈషా రెబ్బా ఈ సినిమాలో సునంద రోల్ పోషిస్తోందట. ఈ మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ,అప్పుడు స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కుతుందని ఈ అమ్మడు మంచి ఆశతో ఉంది. అయితే ఈమె పేరు చూస్తే ఉత్తరాది అమ్మాయి అనుకుంటాం కానీ, పక్కా తెలుగు అమ్మాయి. పుట్టింది పెరిగింది అంతా భాగ్యనగరంలోనే.

తండ్రి సొంతూరు వరంగల్,తల్లి పుట్టిల్లు రాజమండ్రి. అయితే హైదరాబాద్ లో స్థిరపడ్డారు. దీంతో హైద్రాబాదీ అమ్మాయిలా పెరిగింది. ఎంబీఏ చదివిన ఈషా చిన్నప్పటినుంచి డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండేది. స్టడీ అయ్యాక మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఈషా ,అనేక బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించింది. అయితే అనుకోకుండా సినిమాల్లోకి చేరింది. దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తాను తీయబోయే మూవీ లో హీరోయిన్ కోసం తీవ్రంగా వెతుకుతూ, ఫేస్ బుక్ చూస్తుంటే, మెరుపు తీగలా గల ఓ అమ్మాయి పిక్చరర్స్ కనిపించాయట.

దీంతో ఎవరా అని ఆరా తీస్తే,ఈషా రెబ్బా అని తేలిందట. దీంతో ఆమెను తన మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యాడట. ఆవిధంగా ఇంద్రగంటి తీసిన ‘అంతకుముందు ఆతర్వాత’ మూవీతో టాలీవుడ్ లో మెరిసింది. ఆ తర్వాత అల్లరి నరేష్ సరసన బందిపోటు,అడివి శేషు తో అమీ తుమీ లో నటించింది. ఇప్పుడు ఏకంగా తారక్ సరసన వేస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."