Movies

అరవింద సమేతపై బాలయ్య షాకింగ్ కామెంట్స్…. షాక్ లో ఎన్టీఆర్…. ఏమన్నాడో చూడండి

గత కొంతకాలంగా యంగ్ టైగర్ కి బాలకృష్ణకు అసలు పడడంలేదని టాక్ నడుస్తోంది. నిజానికి వీరిద్దరూ ఎక్కడా తారస పడినట్లు గానీ, మాట్లాడుకున్న దాఖలాలు గానీ లేవు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ తండ్రి,తన అన్న అయిన హరికృష్ణ మరణంతో బాలయ్య రెండు రోజులు దగ్గరే ఉండి, అన్ని కార్యక్రమాలు పర్యవేక్షించి, అందరికీ ధైర్యం చెప్పి వెళ్ళాడు. అయితే అరవింద సమేత ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బాలయ్య వస్తాడని, రెండు కుటుంబాలు ఒక్కటి చేస్తాడని అందరూ ఆశించారు. కానీ బాలయ్య రాకపోవడంతో నందమూరి అభిమానులు అసహనానికి గురయ్యారు.
ఈనేపధ్యంలో సినిమా కూడా విడుదల అయింది.

షో చూసాక బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులను షాక్ కి గురిచేశాయి. ఇంతకీ బాలయ్య ఏమన్నాడో ఓసారి చూద్దాం . ‘తండ్రి పోయిన బాధ గుండె నిండా ఉన్నప్పటికి ఎక్కడా బయట పడకుండా ఎంతోనిబ్బరంతో తారక్ అరవింద సమేత చిత్రంలో నటించాడు. ఈ సినిమా చూసాక నా అన్న హరికృష్ణ లోని మొండితనం తారక్ లో కనిపించింది . రాయలసీమ ఫ్యాక్షన్ ని చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు చూపించాడు త్రివిక్రమ్. డైరెక్టర్ ట్రీట్ మెంట్ బాగుంది. తారక్ చాలా అద్భుతంగా పండించాడు’అని బాలయ్య వ్యాఖ్యానించడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫిదా అయ్యారు.