Devotional

దసరా తర్వాత ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే… మీ రాశి ఉందేమో చూసుకోండి

మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు. వాటి ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొంత మంది జాతకాలను నమ్మరు. జాతకాలను నమ్మేవారు మాత్రం విపరీతంగా నమ్ముతారు. ఆలా నమ్మేవారి కోసమే ఈ వీడియో. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశుల్లో ఒక్కో రాశికి నాలుగు నక్షత్రాలు పాదాలు ఉంటాయి. సూర్యుడు ఒక్కో రాశిలో ఒక మాసం పాటు ఉంటాడు. ఆలా ఒక్కో మాసం ఒక్కో రాశిలోకి మారుతూ ఉంటారు. దసరా తర్వాత ఈ గ్రహ సంచారం కారణముగా 12 రాశుల్లో 4 రాశుల వారికీ కష్టాలు అన్ని తీరిపోయి అదృష్టం రావటమే కాకుండా ఉన్నత స్థితికి చేరతారు. ఇప్పుడు దసరా తర్వాత అదృష్టం పట్టే రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రాశివారు దసరా తరవాత ఏ పని చేసిన విజయాన్ని అందుకుంటారు. ఒకవిధంగా చెప్పాలంటే మేషరాశి వారికీ దసరా తర్వాత శుభ ఘడియలు అని చెప్పాలి. ఈ రాశివారికి అధిపతి కుజుడు. అందువల్ల ఈ రాశివారు లక్ష్మీదేవిని,సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అపజయాలు కలగకుండా విజయం వీరి సొంతం అవుతుంది. ఈ రాశివారికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా ఆచి తూచి నిదానంగా తీసుకోవాలి. ఇలా నిదానంగా ఆలోచనలు చేస్తే దసరా తర్వాత వీరికి పట్టిందల్లా బంగారం అనే విధంగా ఉంటుంది.

కర్కాటక రాశి

ఈ రాశివారు దసరా తర్వాత పెద్ద పెద్ద పనులను మొదలుపెట్టి విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఏ పనిని అయినా పట్టుదలగా చేస్తారు. కర్కాటక రాశివారికి అధిపతి చంద్రుడు. వీరికి ఈ సమయంలో దైవ అనుగ్రహం ఎక్కువగా ఉండుట వలన ఏ పని చేసిన సక్సెస్ గా ముందుకు సాగుతారు. వీరు ఈ సమయంలో డబ్బును పొదుపు చేయటం మంచిది. దసరా రోజు జమ్మి చెట్టుకు పూజ చేస్తే వీరికి అష్ట ఐశ్వర్యాలు కలగటమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

కన్యా రాశి

కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశివారికి దసరా తరవాత ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే వీరికి రాజకీయాలు బాగా కలిసివస్తాయి. ఈ సమయంలో ఏ పని చేసిన బాగా కలిసివస్తుంది. అంతేకాక ఉద్యోగం లేనివారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసివచ్చి మంచి స్థాయిలో ఉంటారు. ఈ రాశివారు లక్ష్మి నారాయుణ్ణి,వినాయకుణ్ణి పూజిస్తే అముఞ్చి ఫలితాలు వస్తాయి.

వృశ్చిక రాశి

ఈ రాశివారికి అధిపతి కుజుడు. దసరా తర్వాత వీరు గతంలో చేసి ఆగిపోయిన పనులు మొదలు పెడతారు. అవి విజయవంతం అవుతాయి. దసరా తర్వాత వీరు చేసే పనిలో ధనం సమృద్ధిగా లభిస్తుంది. ఈ రాశివారు శివుణ్ణి ఆరాదిస్తే మంచి జరుగుతుంది. అలాగే అన్ని రాశుల వారు దసరా రోజున గోవుని పూజించాలి.