టాలీవుడ్ కలెక్షన్ కింగ్ ఎవరో చూడండి….అరవింద సమేతVs రంగస్థలంVs భరత్ అనే నేను
యంగ్ టైగర్ ఎన్టీఆర్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తొలిసినిమా ‘అరవింద సమేత వీర రాఘవ ..’. ఈసినిమా ఇప్పుడు దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్ గా విడుదలై,మంచి టాక్ తెచ్చుకుంది. యుఎస్ లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. వీకెండ్ కి వందకోట్ల క్లబ్ లోకి చేరతారని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో టాలీవుడ్ కి యుఎస్ మార్కెట్ బానే కల్సి వస్తోంది. ఎందుకంటే అమెరికా తెలుగు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అందుకే బయ్యర్లు రేటు కి వెనుకాడకుండా కొనేస్తున్నారు. ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ కి సమీమలోకి చేరిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా కూడా అదే రేంజ్ లో దూసుకుపోతోంది.
నిజానికి ‘అరవింద సమేత’ విడుదలకు ముందే టీజర్ కి ,ట్రైలర్ కి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు సినిమా విడుదలతో అంచనాలను నిజం చేస్తూ వసూళ్ల కుంభవృష్టి కురుస్తోంది. భారీ స్క్రీన్స్ పై విడుదలైన ఈ మూవీ తొలిరోజు వరల్డ్ వైడ్ గా 59కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. ఇక యుఎస్ ప్రీమియర్ షోలకు ఆరుకోట్ల వచ్చి పడ్డాయి.
దసరా సెలవలు ముగిసే సమయానికి ‘అరవింద సమేత’ న్యూ రికార్డ్స్ నమోదు చేస్తుందని, సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అంతకు ముందు భరత్ అను నేను,రంగస్థలం మూవీలు సాధించిన రికార్డ్స్ ని కూడా ‘అరవింద సమేత’ అధిగమించేసినట్లు చెబుతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం తొలిరోజు 49కోట్ల 81లక్షల రికార్డుని, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పొలిటికల్ ఎంటర్ టైనర్ భరత్ అను నేను తొలిరోజు వసూలు చేసిన 55 కోట్ల 80లక్షల రికార్డుని ‘అరవింద సమేత’ బ్రేక్ చేసింది. ఈ వారాంతానికి వందకోట్ల క్లబ్ లోకి చేరినా ఆశ్చర్య పోనవసరం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.