Movies

ఎన్టీఆర్, కృష్ణల గొడవ కొడుకుల దాకా ఎలా పాకిందో తెలుసా ? నమ్మలేని నిజాలు

ఫ్యాక్షన్ అయినా, పగలు,ప్రతీకారాలతో అట్టుడికి పోయినా అది తరాలను తాకుతుంది. ఎక్కడో గానీ దానికి అంతం ఉండదు. ఇక తెలుగు చిత్ర సీమలో కూడా తండ్రుల గొడవలు కొడుకుల దాకా చేరిన వైనం వుంది. అది ఎక్కడిదాకా వెళ్లిందంటే కోర్టులకు చేరింది. తెలుగు చిత్రసీమలో ఒక సినిమా విషయంలో కోర్టుకి వెళ్లిన ఘటన అది ఒక్కటేనని చెప్పవచ్చు. వివరాల్లోకి వెళ్తే,సూపర్ కృష్ణ సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ అభిమాని. కానీ సినిమాల్లోకి వచ్చాక ఎన్టీఆర్ కల్సి నటిస్తూ దేవుడు చేసిన మనుషులు చిత్రాన్ని కూడా కృష్ణ తీశారు. ఇంతవరకూ బానే వున్నా, అల్లూరి సీతారామరాజు సినిమాతో ఇద్దరి మధ్యా మాటల్లేకుండా పోయాయి.
NTR – CM of Andhra Pradesh
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగంలో ప్రవేశించి తెలుగు దేశం పార్టీ స్థాపించి అనూహ్య విజయంతో సీఎం అయ్యారు. అయితే, కొద్దికాలానికే కృష్ణ కాంగ్రెస్ లో చేరడమే కాదు ఎన్టీఆర్ పై విరుచుకుపడుతూ ప్రచారం చేసారు. వ్యంగ్యంగా సినిమాలు కూడా తీశారు. ఏలూరు నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడింది. ఎన్టీఆర్ , కృష్ణ ల మధ్య వైరం అలా తారాస్థాయికి చేరి, ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తె, భగ్గుమనే సమయంలోనే ఓ సినిమా టైటిల్ విషయంలో గొడవ తలెత్తింది. అది కోర్టుల వరకూ వెళ్ళింది.

గతంలో మద్రాసు ఫిలిం ఛాంబర్ లో గానీ,ఆంద్ర ఫిలిం ఛాంబర్ లో గానీ సినిమా పేర్లను రిజిస్ట్రర్ చేసుకునేవారు. ఒక అసోసియేషన్ లో నమోదయిన టైటిల్ ని మరో అసోసియేషన్ కూడా తెలుసుకునేవారు. నిర్మాత కేసి శేఖర్ బాబు ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో యాక్టివ్ మెంబర్ గా ఉండేవారు. ఆసమయంలో సామ్రాట్ అనే టైటిల్ ని 1983జూన్ లో నమోదుచేసుకున్నారు. ఆతర్వాత రెన్యూవల్ చేస్తూ వచ్చారు. ఇక ఫిలిం ఛాంబర్ లో కూడా నమోదుచేశారు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా సామ్రాట్ సినిమాను శేఖర్ బాబు ప్రారంభించారు.

అయితే సూపర్ కృష్ణ తన తనయుడు రమేష్ బాబు ని పరిచయం చేస్తూ తీసే సినిమాకు కూడా అదే టైటిల్ పెట్టారు. గిల్డ్ లో కృష్ణ ఈ టైటిల్ నమోదుచేశారు. ఇక ఆసమయంలో కృష్ణ సోదరుడు హనుమంతరావు గిల్డ్ కి ప్రెసిడెంట్.మొత్తానికి ముందూ వెనుకా చూడకుండా గిల్డ్ లో ఆమోదించేసారు. గిల్డ్, ఫిలిం ఛాంబర్ లలో పిర్యాదులు చేసినా లాభం లేకపోవడంతో ఎన్టీఆర్ ప్రోత్సాహంతో శేఖర్ బాబు కోర్టుకి వెళ్లారు. ఇలా ఒక టైటిల్ కోసం కోర్టుకి వెళ్లిన ఘటన కూడా ఇదే తొలిసారి.

పరిశ్రమ కూడా ఎన్టీఆర్ వర్గం,కృష్ణ వర్గం అని రెండు వర్గాలుగా చీలిపోయింది. మీడియా సాక్షిగా ఇరు వర్గాలు తిట్టుకున్నారు. సిటీ సివిల్ కోర్టులో శేఖర్ బాబుకి విజయం దక్కడంతో కృష్ణ ఏకంగా హైకోర్టుకి అప్పీల్ చేసారు. అక్కడ కృష్ణకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇక బాలకృష్ణతో తీసే సినిమాకు సహస సామ్రాట్ అని పెట్టుకోవాల్సి వచ్చింది. పట్టుదలకు పొతే ఇలానే ఉంటుంది మరి.