Movies

అరవింద సమేత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా? నమ్మలేని నిజాలు

సినిమా కు కథ ఎంత ముఖ్యమో పాటలకు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతే ముఖ్యం. అందుకే ఫలానా సినిమా అనగానే అది మ్యూజికల్ హిట్ అని చెప్పడం సహజంగా వింటుంటాం. మెలోడీ సాంగ్స్ ని అందించే సంగీత దర్శకులు రానురాను కొరవడ్తున్నారు. సంగీతం హోరు తప్ప పాట అర్ధం కావడం లేదని కొన్ని సినిమాలలో పాటలను పలువురు ఉదాహరిస్తుంటారు. ఇక సంగీత దర్శకుల్లో ఈమధ్య బాగా పాపులర్ అవుతున్న వాళ్ళలో తమన్ ఒకడు. తాజాగా విడుదలైన అరవింద సమేత.. వీర రాఘవ మూవీకి బాణీలు అందించాడు. గతంలో ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమాకు సంగీతం అందించినప్పటికీ త్రివిక్రమ్ ,ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన తొలిసినిమా కు మ్యూజిక్ అందించడం ఈయనకు తొలిసారి కావడం విశేషం.

ఇక నటులచేత పాటలు పాడించడం ద్వారా ఓ కొత్త రికార్డు సృష్టించాడు తమన్. గతంలో వరుస హిట్స్ అందుకున్న చక్రవర్తి దగ్గర డ్రమ్మర్ గా దాదాపు 700 చిత్రాలకు పనిచేసిన ఘంటసాల శివకుమార్ కుమారుడే తమన్. తల్లి ఘంటసాల సావిత్రి సింగర్ గా రాణించారు. మేనత్త పి. వసంత కూడా ప్రముఖ గాయని. రిథమ్ ప్యాడ్స్,కీ బోర్డు ప్లేయర్,సంగీత దర్శకునిగా, బ్యాక్ గ్రౌండ్ రికార్డర్ గా,నిర్మాతగా, నటుడిగా గాయకునిగా కూడా పేరుతెచ్చుకున్నాడు తమన్ అప్పట్లో దర్శకునిగా,నిర్మాతగా వెలుగొందిన స్వర్గీయ ఘంటసాల బలరామయ్య కు స్వయంగా మనవడే.

తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చిన తమన్, తన తోలి చిత్రం కిక్ తో బ్లాక్ బస్టర్ అందించాడు. నెల్లూరు జిల్లా పొట్టిపాలెం వాసి. ఈయన పూర్తిపేరు ఘంటసాల సాయిశ్రీనివాస్ తమన్ శివకుమార్. ఇక రవితేజ సినిమాలకు వరుసగా సంగీతం అందించి, ఆస్థాన విద్వాంసునిగా పేరొందిన తమన్,అతి తక్కువ కాలంలో స్టార్స్ అందరితో కల్సి పనిచేసి,ఇప్పటికే 50 చిత్రాల మార్క్ చేరాడు.

బృందావనం,రగడ, దూకుడు,నాయక్,సరైనోడు, బాద్షా బిజినెస్ మ్యాన్ ,మిరపకాయ్, వంటి మూవీస్ కి సంగీతం అందించిన తమన్ పై కాపీ కొడతాడనే అనే ముద్ర వుంది. దీన్నే ఆయన వద్ద ప్రస్తావిస్తే, నా సినిమాల్లో వాడిన బాణీలను తానె మళ్ళీ తీసుకుంటే, తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఎవరి స్టైల్ వారికి ఉంటుందని,దర్శక నిర్మాతలు తనను నమ్మినంత కాలం తానూ ఎవరినీ పట్టించుకోనని, అయినా పనిగట్టుకుని విమర్శలను పట్టించుకోనని చెప్పుకొచ్చాడు.