Movies

పవన్ చిన్ననాటి స్నేహితుడు చెప్పిన నమ్మలేని నిజాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద ప్రతి అభిమానికి ఆసక్తి ఉంటుంది. అందులో రాజకీయాల్లోకి వచ్చాకా అది మరి ఎక్కువైంది. ఇలాంటి నేపధ్యంలో పవన్ చిన్ననాటి స్నేహితుడు మరియు ట్యూషన్ మేట్ అయిన గుణరంజన్ తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో పవర్ స్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేసాడు.1987 వ సంవత్సరం ప్రాంతంలో పవన్ తన స్నేహితుడు గుణరంజన్ తో కలిసి నెల్లూర్ లో వినయ్ బాబు అనే లెక్కల మాస్టర్ దగ్గరకు ట్యూషన్ కి వెళ్ళేవారట. అలాగే కాలేజ్ లో కూడా గుణరంజన్ తో పాటు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ గా కూర్చునే వాడట పవన్.

ఇంటర్ లో 8 గ్రేస్ మార్కులతో పాస్ కావటంతో పవన్ గుణరంజన్ తో నేను చదువుకు పనికిరానని అనేవాడట. అప్పుడు గుణరంజన్ అన్నయ్య వలే సినిమాల్లో నటించవచ్చు కదా అని అడిగాను. నా మీద జోక్స్ వేస్తున్నావా అనేవాడు. కాకపోతే అప్పట్లోనే ఏదో ఒకటి చేయాలనే కాంక్ష చాలా ఎక్కువగా ఉండేది.

పవన్ తల్లితండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ తో మా అందరికి డ్రింక్స్ కొని ఇచ్చేవాడు. చాలా బిడియంగా ఉండే పవన్ ఇంతటి స్టార్ అవుతాడని, రాజకీయ పార్టీ స్థాపిస్తాడని కానీ ఊహించలేదని, పవన్ వంటి వ్యక్తులు రాజకీయాలకు చాలా అవసరమని చెప్పుతున్నాడు పవన్ చిన్ననాటి స్నేహితుడు గుణరంజన్.