Movies

‘ఫిదా’ లో సాయి పల్లవి మేనత్తగా నటించిన ఈవిడ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

సినిమా రంగంలో రంగుల ప్రపంచం అంటారు కదా. ఇక అక్కడి పరిస్థితులు అలానే ఉంటాయి. కొందరు ఏదో అవుదామని వచ్చి,మరేదో అవుతారు. ఇక బాల నటులుగా వచ్చి,పెద్దయ్యాక హీరోలుగా రాణిస్తున్నవాళ్లూ ఉన్నారు. చిన్నప్పుడు ఒకటి రెండు సినిమాల్లో నటించి కూడా పెద్దయ్యాక, సినిమాల్లో వేరే రంగాల్లో సెటిల్ అయ్యేవాళ్ళూ ఉన్నారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని వచ్చి స్టార్ హీరో అయిపోయాడు. హీరో అవుదామని వచ్చి ప్రొడ్యూసర్ అయిపోయారు డాక్టర్ డి రామానాయుడు. అసిస్టెంట్ ఎడిటర్ అవుదామని వచ్చి,ఏకంగా వరల్డ్ లెవెల్లోనే టాప్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ రాజమౌళి ఎదిగిపోయాడు.

తనికెళ్ళ భరణి,ఎల్బీ శ్రీరామ్,కృష్ణ భగవాన్, పోసాని కృష్ణమురళి వంటి వాళ్ళు రచయితలుగా వచ్చి యాక్టర్లు, డైరెక్టర్లు అయిపోయారు. కేరక్టర్ ఆరిస్టులుగా వచ్చి,కమెడియన్స్ గా మారిపోయిన వాళ్ళు,హీరోలుగా వెలుగొందుతూ ఛాన్స్ లు తగ్గడంతో విలన్లుగా, క్యారక్టర్ ఆరిస్టులుగా రాణిస్తున్నవాళ్లు ఇలా చెప్పుకుంటూ పొతే చాంతాడు లా జాబితా ఉంటుంది.ఇక కొంతమందికి సినిమాల్లో నటించాలని ఉన్నా, ఫ్యామిలీ కోసం,పిల్లలకోసం రాజీ పడుతూ వుంటారు. అయితే ఛాన్స్ దొరికితే తమకలను నిజం చేసుకుంటారు.

హ్యాపీ డేస్ మూవీతో తెలుగులో కొత్త పంథాకు శ్రీకారం చుట్టిన శేఖర్ కమ్ముల ద్వారా ఆలాంటి అరుదైన ఛాన్స్ ఒకావిడాకు దక్కింది. ఆవిడకు చిన్నప్పటి నుంచి నటి అవ్వాలనే కోరిక ఉండేది. కనీసం సపోర్టింగ్ రోల్స్ లో అయినా వేయాలని ఉండేది. ఛాన్స్ రాలేదు. అయితే కొడుకుని పెద్ద డైరెక్టర్ గా చూడాలని అనుకుంది. అలాగే అతడు మంచి డైరెక్టర్ అయ్యాడు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త నటీనటులను పరిచయం చేస్తూ నేటివిటీ దగ్గరగా ఉండే సినిమాలు తీసే దర్శకునిగా ముద్రపడ్డాడు. ఇక ఇప్పుడు ఆమె నటించాలనే కోరిక తీరింది. అవునండి. ఫిదా సినిమాలో హీరోయిన్ సాయిపల్లవికి మేనత్తగా నటించిన గీతా భాస్కర్.

ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ప్రస్తుతం హీరోలకు, హీరోయిన్స్ కి అమ్మగా, అత్తగా పాత్రలు పోషిస్తున్నారు. దీనికి భిన్నంగా ఓ కొత్త ముఖం కావాలని శేఖర్ కమ్ముల భావించడం వలన గీతా భాస్కర్ కి ఛాన్స్ వచ్చేసింది. ఫిదాలో హీరోయిన్ మేనత్త పాత్రకోసం చాలా ఆడిషన్స్ నిర్వహించిన శేఖర్ కమ్ముల చివరకు ఓ షార్ట్ ఫిలిం లో గీతా నటన చూసి,ఈమె అయితే సరిపోతుందని భావించాడు.

సినిమాలో తొలిసారి నటించినప్పటికీ ఆ పాత్రకు నిండుదనం తెచ్చింది ఆమె. మరి ఇంతకీ ఆమె ఎవరంటే,పెళ్లి చూపులు చిత్రం ద్వారా డైరెక్టర్ గా వచ్చిన తరుణ్ భాస్కర్ తల్లి. తెలుగు ఇండస్ట్రీలో పాతమొఖాలు కాకుండా ఓ కొత్త ముఖం అత్త కేరెక్టర్లో పరిచయం అయింది.