బాబాయ్ పవన్ కళ్యాణ్ సవాల్ ని అబ్బాయి రామ్ చరణ్ స్వీకరిస్తాడా? ఆనందంలో పవర్ స్టార్
గ్రామాల దత్తత కార్యక్రమం అనగానే మనకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు మూవీ గుర్తొస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టాక ఒక్కొక్క ఎంపీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని చెప్పడంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఊపందుకుంది. ఇదే కాన్సెప్ట్ ని మహేష్ బాబు మూవీ ద్వారా చూపించడంతో పాటు గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని,సౌకర్యాల కల్పనకు కృషిచేసున్నాడు. ఇక గత ఎన్నికల ముందు జనసేన పార్టీ నెలకొల్పిన పవన్ కళ్యాణ్, ఎన్నికల్లో పోటీ చేయకుండా బిజెపి,టిడిపి కూటమికి మద్దతిస్తూ విస్తృతంగా ప్రచారం చేసాడు.
ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని,సినిమాలకు గుడ్ బై చెప్పేసి,ప్రజల మధ్య జోరుగా మమేకం అవుతున్నాడు. ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు వచ్చి జనసేనలో చేరడంతో మంచి దూకుడు మీద జనసేన ఉంది. మొన్ననే ధవళేశ్వరం కాటన్ బరాజ్ నుంచి లక్షలాది మందితో కవాతు నిర్వహిచిన పవన్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు.
తిత్లి తుపాన్ లో అతలాకుతం అయిన ప్రాంతాల్లో పర్యటిస్తూ, జన సమస్యలను తెలుసుకుంటున్నారు. మీ జీవితాల్లో మార్పుకోసం యువతను ప్రోత్సహించాలని కోరుతున్నాడు. అయితే అంతటితో ఆగకుండా హీరో రామ్ చరణ్ తో మాట్లాడి ఓ గ్రామాన్ని దత్తత తీసుకోమని కోరనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఒక విధంగా పవన్, రామ్ చరణ్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. వీళ్ళిద్దరూ బాబాయ్, అబ్బాయి అనే కన్నా అన్నదమ్ములు అనేలా ఉంటారు.
మరి బాబాయి మాటను అబ్బాయి ఎలా ఆచరణలో పెడతాడో చూడాలి. కాగా పవన్ ఎక్కడ సభ పెట్టినా ఊహించని రీతిలో జనం హాజరవుతున్నారు. దీంతో పవన్ అభిమానుల్లో, జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సహం నెలకొంటోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన కీలక భూమిక వహిస్తుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. బాబాయ్ పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం రామ్ చరణ్ గ్రామాన్ని దత్తత తీసుకోటానికి అంగీకారం తెలిపాడు.