Movies

జబర్దస్త్ చమక్ చంద్ర ఎంత సంపాదించాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

తెలుగు టీవీ చానల్స్ లో మోస్ట్ పాపులర్ రియాల్టీ షోగా రాణిస్తున్న ప్రోగ్రాం ఈటీవీలో జబర్ దస్త్ కార్యక్రమం. మొదట్లో విమర్శలు వచ్చినా వీరలెవెల్లో క్లిక్ అయిన షో ఇది. 2013లో మొదలైన ఈ షో అవిచ్ఛిన్నంగా సాగుతోంది. టిఆర్పి రేటింగ్ అదిరిపోతోంది. 6ఏళ్ళ వయస్సు నుంచి 60ఏళ్ళ ప్రాయం వరకూ అందరినీ ఆకర్షించి అలరిస్తున్న షోగా గుర్తింపు పొందింది. ఇక ఈ షోద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఎదిగారు. కొందరు బయట షోలతో కూడా సంపాదన పెంచుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా ‘జబర్ దస్త్’ఫెమ్ అనే పేరు మారుమోగిపోతోంది. ఇక ఆర్ధికంగా కూడా బానే నిలదొక్కుకున్నారు.

జబర్ దస్త్ లో నటించిన వాళ్ళు యాంకర్లుగా, జూనియర్ ఆర్టిస్టులుగా,హీరోలుగా,రాణిస్తూ సంతోహాసంగా వున్నారు. మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడి ఈ షోలో ఎంట్రీ సంపాదించినవాళ్లు,ఇప్పుడు పదిమందికీ సాయం చేసే స్థాయికి కూడా కొందరు ఎదిగారు. ఇక ఈ షో ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన నటుడు చమక్ చంద్ర. యితడు కామెడీతో పాటు అమ్మాయి వేషం వేసి, అచ్చం అమ్మాయే అనిపించేలా జీవిస్తాడు.

యితడు అమ్మాయి వేషం కట్టి, షో లో కనిపిస్తే చాలు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకుంటారు. మిగిలిన వారికి భిన్నంగా స్కిట్స్ రూపొందించి ప్రదర్శించడంలో దిట్ట.ఇక సినిమాల్లో కూడా తనదైన బాణీలో నటిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు అద్దెంట్లో ఉండే చమక్ చంద్ర, అద్దె కట్టడానికే ఇబ్బందులు పడ్డాడు. ఐతే ఇప్పుడు మణికొండలో కోటి రూపాయలు పెట్టి సొంత ఇంటిని నిర్మించుకున్నాడు.

అంతేకాదు ఓ బెంజి కారు కూడా కొనేసాడు. చమక్ చంద్ర లెవెల్ పూర్తిగా ఇలా మారిపోవడం చూసి చాలామంది షాకయ్యారు. కష్టపడే తత్త్వం,చిత్తశుద్ధి ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వున్నా, ఉన్నత స్థాయికి చేయవచ్చనడానికి చమక్ చంద్ర తార్కాణం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."