Politics

మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో బిజీగా మారనున్నాడా?

కొద్దీ రోజుల క్రితం సినీ హీరో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఓ లేఖ విడుదల చేసాడు. ఇక ప్రజలకు తన వంతు సాయం చేస్తానని .. ఈ జీవితం ప్రజా సేవకే అంకితం అంటూ .. నేను రాయలసీమకి వచ్చేస్తున్నా .. తనకు అత్యంత ఇష్టమైన తిరుపతి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తాను అంటూ లేఖ విడుదల చేసాడు. అయితే అప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దపడుతున్నాడనే అనుమానాలు అందరికి కలిగాయి. తాజాగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోమని తన అన్న కుమారుడు రామ్ చరణ్ ను అడిగిన పవన్ కల్యాణ్‌ను. అలాగే.. బాబాయ్ విజ్ఞప్తిని అంగీకరించి తీసుకుంటాన్న అబ్బాయ్ నిర్ణయాన్ని ఏక కాలంలో పొగిడేస్తే.. ఓ పోస్ట్ పెట్టేశారు. హీరో రామ్‌చరణ్ మంచి మనుసును చూస్తుంటే మజోన్‌కు గర్వంగా ఉందట. చరణ్ సోదరిడిగా గర్వపడుతున్నారట. గ్రామాన్ని దత్తత తీసుకోవడం చాలా మంచి పని అంటూ పొగడతలతో ముంచెత్తుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టేసాడు.

వాస్తవంగా చూసుకుంటే శ్రీకాకుళం తుఫాన్ బాధితులకు చాలామంది సినీ ఇండ్రస్ట్రీ వారు సహాయం అందించారు. నిఖిల్ లాంటి హీరో. సంపూర్ణేష్ లాంటి నటుడు కూడా క్షేత్ర స్థాయికి వెళ్లి తమ వంతు సాయం అందించి వచ్చారు. అల్లు అర్జున్ పాతిక లక్షలు క్యాష్ ఇచ్చారు. ఇక నందమూరి కుటుంబం కూడా విరాళాలు ప్రకటించారు.

వీరందరూ చేసినది.. మంచు మనోజ్‌కి మంచిగా కనిపించలేదా..? కేవలం పవన్ చరణ్ లను ఉన్నట్టుండి ఇలా పొగడడం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది అనే అనుమానాలు అందరికి కలుగుతున్నాయి. మెల్లిమెల్లిగా మెగా ఫ్యామిలీకి దగ్గరవుతూ తన పొలిటికల్ ఎంట్రీకి మార్గం ఈజీగా ఉండేలా మనోజ్ ప్లాన్ చేసుకుంటున్నట్టు అర్ధం అవుతోంది.

ఉన్నట్టుండి మనోజ్ తిరుపతికి మకాం మారుస్తున్న అని ప్రకటించడం వెనుక , సేవ కార్యక్రమాలు చేస్తా అనడం వెనుక ఉన్న రాజకీయం ఇదే అని తెలుస్తోంది. ఇక ఆయన చేరదామన్నా టీడీపీ, వైసీపీల్లో ఖాళీల్లేవు. ఉంటే ఈ పాటికి.. మనోజ్‌ను కాదు.. ఆయన తండ్రిని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించి ఉండేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక్క ఆప్షన్ గా కనిపిస్తోంది జనసేన మాత్రమే.

అది కూడా యూత్ ఫాలోయింగ్ ఉన్న పార్టీ కావడం.. పవన్ సామజిక వర్గంతో పాటు తన సామాజికవర్గం కూడా కలిస్తే తన గెలుపుకు తిరుగుండదు అనే లెక్కల్లో మనోజ్ ఉన్నాడు. అయితే ఆయన చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? ఇచ్చినా సీటు గ్యారంటీనా అనే క్లారిటీ వస్తే మంచు వారబ్బాయ్ పొలిటికల్ త్వరలోనే ఉన్నడవచ్చు.