Movies

జయం ‘సుమన్ శెట్టి’ సినిమాలకు దూరంగా ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా? నమ్మలేని నిజాలు

సినిమా రంగమే ఓ విచిత్రమైనది. ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఒక్కొక్కరికి ఛాన్స్ లు వస్తాయి. మళ్ళీ కొన్ని కారణాల వలన ఆగిపోతాయి. అన్నీ బాగుంటేనే అందరూ పట్టించుకుంటారు. లేకపోతె ఎవరి తిప్పలు వారే పడాలి. తేజ దర్శకత్వంలో నితిన్ ,సదా జంటగా వచ్చిన ‘జయం’సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమన్ శెట్టి కమెడియన్ గా ఓ వెలుగు వెలిగి మళ్ళీ చతికిలా బడిపోయాడు. ఛాన్స్ లు రాకపోవడంతో సొంతూరు వెళ్ళిపోయాడు. ఇక ఛాన్స్ లు రావన్న నిర్ణయానికి వచ్చేసాడు. అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం.

పొట్టిగా,లావుగా, నల్లగా కనిపించే సుమన్ శెట్టి కమెడియన్ గా బానే రాణించాడు. చూడగానే నవ్వు పుట్టించే కమెడియన్ లలో ఒకడిగా గుర్తింపు పొందిన యితడు జయంతో వెండితెర మీద మెరిసి అనతికాలంలోనే స్టార్ కమెడియన్ అయిపోయాడు. నల్గొండ జిల్లా మిర్యాలగుడాకు చెందిన సుమన్ శెట్టి తండ్రి కిరాణా దుకాణం నడిపేవాడు. తండ్రి ఎక్కడికైనా వెళ్తే దుకాణంలో కూర్చునేవాడు.

ఓ రోజు జయం సినిమా ఆడిషన్స్ ప్రకటన చూసి ఫోటోలు పంపాడు. ఆ ఫోటోలు చూసిన చిత్ర బృందం ఇక వెంటనే సుమన్ శెట్టిని ఒకే చేసేసింది.
అలా జయం మూవీతో ఎంట్రీ ఇచ్చిన సుమన్ శెట్టి కి వరుస ఛాన్స్ లు వచ్చిపడ్డాయి. ఏడాదికి 7,8సినిమాల్లో నటిస్తూ యువ కమెడియన్స్ లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇక 2009లో నాగభవాని అనే అమ్మాయితో సుమన్ శెట్టికి విశాఖలో పెళ్లి అయింది.

అప్పటికే లావుగా ఉండే యితడు పెళ్లాయ్యాక మరింత లావు అయిపోవడంతో ఎన్నో ఛాన్స్ లు మిస్సయ్యాడు. ఇక గబ్బర్ సింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలిపించుకుని లావు తగ్గాలని, బరువు తగ్గితే ఛాన్స్ లు వస్తాయని, ఇప్పటినుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయమని చెబుతూ ఆ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

గబ్బర్ సింగ్ తర్వాత కూడా సుమన్ శెట్టి లో పెద్దగా మార్పు రాకపోవడం,అనారోగ్య సమస్య కారణంగా ఇక బరువు తగ్గే ఛాన్స్ లేకపోవడంతో ఫ్యామిలీతో సహా వైజాగ్ వచ్చి కిరాణా కొట్టు పెట్టుకుని సెటిల్ అయ్యాడు. ధనలక్ష్మి ఐ లవ్ యు,కబడ్డీ కబడ్డీ , 7జి బృందావనం కాలనీ,హ్యాపీ,ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే,రెడీ,బెండు అప్పారావు ఆర్.ఎం.పీ. వంటి మూవీస్ లో చేసి, ఆడియన్స్ ని నవ్వించిన సుమన్ శెట్టి లావు కారణంగా సినీ ఛాన్స్ లు కోల్పోయి వ్యాపారానికి పరిమితం అయ్యాడు.