Movies

ఈశ్వర్ నుంచి బాహుబలి దాకా ప్రభాస్ కెరీర్ ఎలా సాగిందో చూడండి

సినీమాల్లో బ్యాక్ గ్రౌండ్ ఎంతున్నా స్టామినా లేకుంటే ఎందుకు ఉపయోగం ఉండదు. ఆలాంటి ఘటనలు ఇండస్ట్రీలో కోకొల్లలు. ఫుల్ స్టామినా ఉందని నిరూపించాడు ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణం రాజు సోదరుని కుమారుడైన ప్రభాస్ ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ బాహుబలితో అంతర్జాతీయ రేంజ్ కి చేరిపోయాడు. ఐదేళ్లపాటు బాహుబలి కోసం ప్రభాస్ చేసిన శ్రమ ఫలించి ఎనలేని కీర్తిని తెచ్చుకున్నాడు. ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. ఈవేళ బర్త్ డే జరుపుకుంటున్న ప్రభాస్ బాహుబలి తరహాలో సాహు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం 200కోట్లు ఖర్చుచేసున్నట్లు చెబుతున్నారు. అలాగే జిల్ రాధాకృష్ణ తీస్తున్న సినిమాలో కూడా న్యూ లుక్ తో కనిపించబోతున్నాడు.

2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ వెండితెరకు పరిచయం అయిన ప్రభాస్ వరుస విజయాలు అందుకుంటూ వస్తున్నాడు. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా ఈశ్వర్ తెలుగులో తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో రాఘవేంద్ర మూవీలో చేసాడు. 2004లో త్రిష సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్ కు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు.

2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, శ్రియా సరసన ఛత్రపతి సినిమా భారీ విజయాన్ని నమోదుచేసుకుని ప్రభాస్ ను తెలుగులో ఒక ప్రముఖ నటుడిగా నిలబట్టింది. ఆ తర్వాత విడుదలైన పౌర్ణమి, యోగి సినిమాలు చేసాడు. ఆ తర్వాత ప్రభాస్ ఇలియానా సరసన పైడిపల్లి వంశీ దర్శకత్వంలో వచ్చిన మున్నా సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.

2008లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరియర్ లో రెండో సారి బుజ్జిగాడు, 2009లో మెహెర్ రమేష్ దర్శకత్వంలో అనుష్క, నమితల సరసన బిల్లా , ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఏక్ నిరంజన్ ,010లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సరసన డార్లింగ్,2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ తో కలిసి దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్‌ఫెక్ట్ ,2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమన్నా, దీక్షా సేథ్ దర్శకత్వంలో రెబెల్,2013లో ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాలు చేసాడు.

రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతో ప్రభాస్ కలసి నటించిన బాహుబలి మొదటి భాగం “బాహుబలి – ది బిగినింగ్ ” తెలుగు, తమిళ, మలయాళ , హిందీ భాషలలో భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది.

బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో చేస్తున్న సాహో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం 2019 లో విడుదల కి సిద్ధంగా ఉంది.