Movies

కమెడియన్ సుధాకర్ పరిస్థితి ఎలా ఉంది… ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా? నమ్మలేని నిజాలు

ఎంతో అందంగా కనిపించే సినిమా ప్రపంచంలో ఉండే రాజకీయాలు,కుట్రలు ,కుతంత్రాలు మరెక్కడా ఉండవని చాలామంది అంటుంటారు. స్టార్ ఇమేజ్ తో దూసుకెళ్తుంటే గ్రూపులు కట్టి దెబ్బకొట్టే వాతావరణానికి సుధాకర్ బలైయ్యాడని చాలామందికి తెలీదు. చిరంజీవి,నారాయణరావు,హరిప్రసాద్ లతో ఒకే రూమ్ లో ఉంటూ ఒకే చోట నటనలో శిక్షణ పొందిన సుధాకర్ నిజానికి చిరంజీవి కన్నా ముందే సినిమాల్లో హీరోగా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆరోజుల్లో సుధాకర్ , రాధిక జోడీ హిట్ ఫెయిర్ గా నిలించిందట. అయితే అక్కడే అతనిపై కుట్ర చేసారు. అదెలాగో తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సుధాకర్ తండ్రి రత్నం ఆరోజుల్లో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేవారు. తల్లి కటాక్షమ్మ. ఏడుగురు అన్నదమ్ముల్లో చివరివాడు. ఏలూరు,గుంటూరులలో స్టడీ పూర్తిచేసిన సుధాకర్ సినిమాలపై ఆసక్తితో మద్రాస్ చేరాడు.

అప్పటికే చిరంజీవి తదితరులు ఒక రూమ్ లు ఉంటే వాళ్ళతో సుధాకర్ జతకట్టి,అందరూ ఫిలిం యునిస్టిట్యూట్ లో శిక్షణ పొందాడు. అయితే భారతీరాజాతో కల్సి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సుధాకర్ కి అనుకోకుండా తమిళంలో హీరో ఛాన్స్ వచ్చేసింది. కిల్లకే పొగం రైల్ అనే మూవీలో హీరోగా వేసి మంచి హిట్ కొట్టాడు. దాంతో వరుసపెట్టి ఛాన్స్ లు వచ్చాయి.

ఆరోజుల్లో ఇళయరాజా మ్యూజిక్ ఇస్తుంటే, బాల సుబ్రహ్మణ్యం పాటలు పాడేవాడు. అలా 35సినిమాల్లో హీరోగా వేసాడు. అందులో 19కి పైగా మూవీస్ లో రాధిక హీరోయిన్ అంటే అర్ధం చేసుకోవచ్చు. అయితే తెలుగు వాడన్న కారణంతో సుధాకర్ పై కుట్రలు నడిచాయి . అవి తట్టుకోలేక తెలుగు పరిశ్రమకు వచ్చేసాడు. అయితే హీరోగా ఛాన్స్ లు రాకపోవడంతో విలన్ గా నటించడం మొదలు పెట్టి ,మెల్లిగా విలనిజాన్ని కామెడీ టచ్ ఇచ్చిన ఘనత సుధాకర్ దే. అలా ఎన్నో చిత్రాల్లో నటించిన సుధాకర్ నిర్మాతగా కూడా రాణించాడు.

చిరంజీవి కెరీర్ లో మరపురాని హిట్ గా నిల్చిన యముడికి మొగుడు మూవీకి సుధాకర్ నిర్మాత. ఆతర్వాత తాతయ్య పెళ్లి – మనవడి శోభనం,పరుగో పరుగు,కిష్కిందకాండ,వంటి చిత్రాలు నిర్మించిన సుధాకర్ పెద్దరికం,స్నేహితులు వంటి చిత్రాల్లో నటనకు నంది అవార్డులు వచ్చాయి. అయితే ఒకదశలో ఛాన్స్ లు తగ్గిపోవడంతో తాగుడుకు బానిస అయ్యాడు.

దీంతో లివర్, కిడ్నీలు బాగా పాడైపోయి కోమాలోకి వెళ్ళాడు. ఇక మామూలు మనిషి అవ్వడేమో అనుకున్న సమయంలో మళ్ళీ కోలుకుని మనిషయ్యాడు. ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించి పూర్వపు సుధాకర్ గా మారాడు. 2017లో హీరోయిన్ తండ్రి పాత్ర తో ఓ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సుధాకర్,చాలా గ్యాప్ తర్వాత కూడా ఎక్కడా తడబాటు లేకుండా నటించి మెప్పించాడు.

పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా వాడు నేను కాదు మూవీలో కూడా మంచి పాత్ర దక్కించుకున్నాడు. సుధాకర్ అనగానే పితుహు అనే డైలాగ్ గుర్తొస్తుంది. అంతగా కామెడీ పండించిన సుధాకర్ జీవితంలో కుట్రలు ఎదుర్కొని నిలబడ్డాడు. ఇక ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి మరణం అంచుల దాకా వెళ్లి వచ్చాడు. హీరో నుంచి విలన్ గా, ఆతర్వాత కమెడియన్ గా మారిపోయిన సుధాకర్ ప్రస్తుతం బానే ఉండడం వెనుక ఆ ప్రభువు దయ ఉందని చెబుతాడు.