Movies

M.S.నారాయణ కొడుకు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా? ఏమి చేస్తున్నాడో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో కొందరి జీవితాలు అనుకున్నట్టు సాగితే,మరికొందరి జీవితాలు ఎందుచేతనే ముందుకి సాగవు. అనుకున్నవి జరగవు. సానుభూతి చూపేవాళ్లే కానీ కనికరించేవారుండరు. దీంతో ఆ వ్యధ అలాగే ఉంటుంది. ఇక ఎమ్మెస్ నారాయణ నటుడుగా,రచయితగా,మరీ ముఖ్యంగా కమెడియన్ గా ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. కానీ కొడుకు విక్రమ్ ని ఓ హీరోగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నం ఎందుకనో నెరవేరలేదు. ఇక ఎంఎస్ మరణంతో అందరి దగ్గరకూ వెళ్లి హీరోగా ఛాన్స్ కోసం అడిగినా పని జరగలేదు. ఎంఎస్ కొడుకుగా సానుభూతి చూపడం మినహా ఒక్కరూ అవకాశం ఇవ్వలేదు. ఇక లాభం లేదని ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తూ నటుడిగా తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తున్నాడు. పెద్ద హీరోల సినిమాల్లోనే కాదు చిన్న చిన్న హీరోల సినిమాల్లో సైతం సైడ్ రోల్స్ లో నటించడం అలవాటు చేసుకున్నాడు.

విక్రమ్ పేరులో సవ్యసాచి కూడా చేర్చి విక్రమ్ సవ్యసాచిగా సినిమాల్లో నటుడిగా కొనసాగుతున్నాడు. ఇక అతడి భార్య ఐటి ఎక్స్ పెర్ట్. వీళ్లకు ఇద్దరు కుమారులు. ఈ మధ్యే మణికొండలో సొంతంగా ఫ్లాట్ కూడా కొనుక్కున్నారు. గృహప్రవేశం సందర్బంగా సినీ ప్రముఖులంతా తరలివచ్చారు. అందరూ ఆశీర్వదించారు. అలాగే ఈ మధ్య తండ్రి ఎమ్మెస్ బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించాడు.

ఈ సందర్బంగా తండ్రిని తలచుకుంటూ ‘నన్ను హీరోగా నిలబెట్టాలని నాన్న ఎంతో తపించాడు. కొడుకు పేరుతొ సినిమా తీసాడు. కానీ ఇప్పుడు చిన్న పాత్రలకే పరిమితం అవ్వడం వలన ఎలాంటి బాధ లేదు. నిజానికి తండ్రి నన్ను ఎప్పుడో హీరో చేసాడు’అని కంట తడిపెట్టాడు.
నిజానికి ఓ రైతు కుటుంబంలో పుట్టిన ఎంఎస్ నారాయణ కాలేజీ లెక్చరర్ గా చేస్తూ సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్నాడు. కాలేజ్ లో తన స్టూడెంట్ నే లవ్ మ్యారేజ్ చేసుకున్న ఎంఎస్ కి ఇద్దరు పిల్లలు.

కుమార్తె సినిమాల్లో డైరెక్టర్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ఇక కొడుకు విక్రమ్ చిన్న చితకా వేషాలతో నెట్టుకొస్తున్నాడు. ఇక సినిమాల్లో వారసత్వం ఎప్పటినుంచో వస్తోంది. అదే క్రమంలో తన కొడుకుని హీరోగా చేయాలనుకున్న ఎంఎస్ అందుకోసం ప్రయత్నాలు చేసాడు. ప్రొడ్యూసర్స్ దొరక్కపోవడంతో తన సన్నిహితుడైన తాడి తాతారావు ని నిర్మాతగా పెట్టి,తానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి, విక్రమ్ హీరోగా ‘కొడుకు’ పేరిట మూవీ తీసాడు.

కమర్షియల్ సినిమాయే తీసినా,రిలీజ్ కి నానా తంటాలు పడ్డాడు. ఇక సినిమా అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో విక్రమ్ నిలదొక్కులేక పోయాడు. ఎంఎస్ ఆర్ధికంగా దెబ్బతిన్నాడు. మళ్ళీ సినిమాల్లో నటిస్తూ సంపాదించుకుందాం లే అనుకునే సమయంలో ఆరోగ్యం దెబ్బతిని, సడన్ గా మరణించాడు ఎంఎస్. ఇక తండ్రి అండతో సినిమాల్లో ఎదగాలని అనుకున్న విక్రమ్ ఇక గత్యంతరం లేక,చిన్న పాత్రలతో నెట్టుకొస్తున్నాడు.