Movies

హీరో ఉదయ్ కిరణ్ గుర్తు ఉన్నాడా…అతని చెల్లి పెద్ద సింగర్… ఆమె ఎవరో తెలుసా? నమ్మలేని నిజాలు

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ దండిగా ఉన్నవాళ్లు వస్తారు. టాలెంట్ ఉంటె నిలబడిపోతారు. అలాగే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో టాలెంట్ ని నమ్ముకుని ఫీల్డ్ లోకి వచ్చి,నిలదొక్కుకుంటారు. ఇలా రెండు బాపతు వాళ్ళు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉంటారు. ఇక అర్ధాంతరంగా జీవితం ముగించుకుని ఆత్మహత్య చేసుకున్న హీరో ఉదయ కిరణ్ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా స్వశక్తి తో ఎదుగుతున్న సమయంలో ఆర్ధిక కష్ఠాలు సినీ ఛాన్స్ లు మిస్సవడం,కుటుంబ సమస్యలు చుట్టుముట్టి, మానసిక సంఘర్షణలో 37ఏళ్ళ వయస్సులో ప్రాణాలు తీసుకున్నాడు.

ఇక సినిమా పరిశ్రమలో ఉదయ్ కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అందులో ప్రముఖ సింగర్ పర్ణిక ఒకరు. ఇల్లందమ్ కేక కేక,ఒళ్ళంతా కాకా కాకా పాటతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సింగర్ పర్ణిక ఎందరో అభిమానులను సంపాదించుకుంది.

నిజానికి ఉదయ్ కి పర్ణిక స్వయానా చెల్లెలు. ఆమె పెదనాన్న కొడుకే ఉదయ్. హీరో ఉదయ్ గురించి పర్ణిక చెప్పిన విషయాలు ఆసక్తిగానే ఉంటాయి.కాగా ఉదయ్ కిరణ్ పెదనాన్న అయిన పర్ణిక తండ్రి మాన్య భాస్కర్ ఎన్నో సినిమాల్లో ,పలు టివి సీరియల్స్ లో నటిస్తున్నాడు. రంగస్థలం ,సర్ధార్ గబ్బర్ సింగ్ వంటి పెద్ద సినిమాల్లో సైతం యితడు నటించాడు.

దాదాపు వందకు పైగా సినిమాల్లో,ఆలాగే పదుల సంఖ్యలో టివి సీరియల్స్ లో నటించిన భాస్కర్ అందరిని మెప్పిస్తున్నాడు. ఇక పర్ణిక సింగర్ గా కొనసాగుతున్నా, ఏనాడూ ఉదయ్ కిరణ్ గురించి చెప్పుకోకుండా సొంతంగా స్యయం కృషితో రాణిస్తోంది.