ఎన్టీఆర్ మూడో తరం పిల్లలు మొత్తం 20 మంది ఏ స్థాయిలో ఉన్నారో తెలుసా?
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు పేరు చెబితే తెలియని వారుండరు. నటుడిగా విశ్వ విఖ్యాతమై,రాజకీయాల్లో ప్రభంజనమై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం. ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ పేరు చెబితేనే ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి జనం బ్రహ్మరధం పడతారు. ఎన్టీఆర్,బసవతారకం లకు 12మంది సంతానం కాగా వారి పిల్లలను లెక్కేస్తే దాదాపు 20మంది వరకూ ఉన్నారు. ఇలా ఎన్టీఆర్ మూడో తరంలో అందుబాటులో గల మనవలు, మనవరాళ్లు కూడా మంచి పొజిషన్ లోనే ఉన్నారు. మొదటి కొడుకు రామకృష్ణ సీనియర్. ఈయన 32వ ఏటనే కన్నుమూశారు.
ఇక రెండవ కొడుకు జయకృష్ణ. ఆయన భార్య పద్మజ. వీరికి కుమిలిని అనే కుమార్తె,కుమారుడు చైతన్య కృష్ణ. కుమిలిని భర్తతో గొడవల కారణంగా 2009లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈమెకు విరాట్ ప్రసాద్, నీల్ ప్రసాద్ అని ఇద్దరు కుమారులు. మూడవ కుమారుడు నందమూరి సాయికృష్ణ 2004లో చనిపోయారు. ఈయన భార్య మాధవీమణి. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మనస్విని ని కిరణ్ కంభంపాటి కి ఇచ్చి పెళ్లి చేసారు.. ఇక నాల్గవ కుమారుడు హరికృష్ణ. ఈయన కు లక్ష్మి , షాలిని అని ఇద్దరు భార్యలు. లక్ష్మి కి జానకిరామ్, కళ్యాణ్ రామ్ అనే ఇద్దరు కుమారులతో పాటు కూతురు సుహాసిని ఉన్నారు.
పెద్ద కొడుకు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈయనకు ఇద్దరు కుమారులు. కళ్యాణ్ రామ్, భార్య స్వాతిలకు ఒక కొడుకు,ఒక కూతురు. ఇక హరికృష్ణ రెండో భార్య షాలిని జూనియర్ ఎన్టీఆర్ ఏకైక సంతానం. భార్య లక్ష్మి ప్రణతి. వీరికి ఇద్దరు కుమారులు. ఎన్టీఆర్ 5వ కొడుకు మోహన్ కృష్ణ. ఈయనకు ,కుమార్తె మోహన రూప, కుమారుడు తారక రత్న ఉన్నారు. మోహన రూపకు కృష్ణ కళ్యాణ్ తో పెళ్లయింది. తారక రత్న భార్య అలేఖ్య.
వీరికి ఒక కుమారుడు. ఇక ఆరవ కుమారుడు బాలకృష్ణ,ఈయన భార్య వసుంధరా దేవి. వీరికి ఇద్దరు కుమార్తెలు,ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కుమార్తె బ్రాహ్మణి భర్త లోకేష్ కాగా,వీరికి దేవాన్ష్ అనే ఒక కుమారుడు. ఇక రెండవ కుమార్తె తేజస్విని భర్త భరత్. వీరికి ఒక కుమారుడు. ఇక ఎన్టీఆర్ ఏడవ కుమారుడు రామకృష్ణ జూనియర్. ఈయనకు ఒక కుమార్తె,ఒక కుమారుడు ఉన్నారు. 8వ కుమారుడు జయశంకర్ కృష్ణ.
ఇక ఎన్టీఆర్ కూతుళ్ళ విషయానికి వస్తే, పెద్ద కుమార్తె లోకేశ్వరి. ఈమె భర్త గారపాటి వెంకటేశ్వరరావు. వీరికి ఒక కుమారుడు.
ఇక రెండవ కుమార్తె పురంధరేశ్వరి, ఈమె భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు. వీరికి హితేష్ చెంచు రామన్ అనే కొడుకు,నివేదిత అనే కూతురు ఉన్నారు. కొడుకు హితేష్ రాజకీయాల్లోకి వచ్చే యోచనలో ఉన్నాడు. ఇతని భార్య పూజ. కూతురు నివేదిత స్టార్ కెమికల్స్ హాస్పిటల్ చైర్మన్. ఎన్టీఆర్ మూడవ కుమార్తె భువనేశ్వరి. ఈమె భర్త చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సీఎం గా ఉన్నారు. వీరికి లోకేష్ ఏకైక కుమారుడు. ఇక ఎన్టీఆర్ నాల్గవ కుమార్తె ఉమా మహేశ్వరి. డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ ఈమె భర్త. వీళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు.