Movies

ఆ రోజుల్లో ఎన్టీఆర్ ని నిద్ర లేపడం దర్శక నిర్మాతల తరమా? మరి ఏమి చేసేవారో తెలుసా?

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ ఎన్నో పాత్రలలో జీవించారు. అది పౌరాణికం అయినా, జానపదం అయినా,సాంఘికం అయినా ఎన్టీఆర్ నటనా చాతుర్యం చూసి తీరాల్సిందే. ఏపాత్ర అయినా ఆయనకు కొట్టినపిండే. ఇక ఆయన అలవాట్లు,ఆహార నియమాలు,క్రమశిక్షణ అన్నింటా ఆయనకు ఆయనే సాటి. తెల్లవారుఝామున లేవడం గానీ, సెట్స్ కి వెళ్ళినపుడు ఏకాగ్రతగా ఉండడం గానీ, నటీనటులను ఎంకరేజ్ చేయడం గానీ ఎన్టీఆర్ ని మించినవారు లేరని చెబుతారు.

ఇక ఎన్టీఆర్ కి కొన్ని లక్షణాలున్నాయి. అందులో ముఖ్యంగా సెట్ లోకి వచ్చినపుడు షాట్ రెడీ అయ్యేలోగా ఓ కునుకు తీసేసేవారట. అయితే షాట్ రెడీ అయ్యాక లేపమని చెప్పి మరీ నిద్రలోకి జారుకునేవారట. అంతవరకూ బానేవుంది, అయితే షాట్ రెడీ అయ్యాక ఆయన్ని లేపే ధైర్యం ఎవరికీ ఉండేది కాదట. డైరెక్ట్ గా నిద్ర లేపితే ఏమైనా అంటారేమోననే భయం ఉండేదట. అందుకే ఓ చిట్కా అమలు చేశారట.
NTR – CM of Andhra Pradesh
అదేంటంటే ముగ్గురు వ్యక్తులకు మూడు ప్లేట్స్ ఇచ్చి,ఎన్టీఆర్ నిద్రపోయే స్థలానికి కొద్దిదూరంలో ఉంచేవారట. ఆ ముగ్గురిలో దూరంగా ఉండే వ్యక్తి ముందుగా ప్లేట్ కిందికి పడేసేవాడు. ఆ శబ్దానికి ఎన్టీఆర్ నిద్రలేవకపోతే రెండో వ్యక్తి ప్లేట్ పడేసేవాడు. అప్పటికీ లేవకపోతే ఇక బాగా దగ్గరగా ఉండే మొదటి వ్యక్తి ప్లేట్ కూడా కింద పడేసేవాడు.

దీంతో శబ్దం కాస్త ఎక్కువగా ఉండడంతో అప్పుడు ఒక్కసారిగా ఎన్టీఆర్ నిద్ర లేచేవారట. అలా మెలుకువ వచ్చిన ఎన్టీఆర్ తో అసిస్టెంట్ డైరెక్టర్ షాట్ రెడీ సార్ అని చెప్పడం,ఆయన వెంటనే షాట్ కి సిద్ధంగా వెళ్లిపోవడం జరిగేదట.