మోహన్ బాబు భార్య గురించి తెలుసా?
మోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో 19 మార్చి 1952న జన్మించాడు. అయన అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు – రంగనాధ్ చౌదరీ, రామచంద్ర చౌదరీ మరియు క్రిష్ణ – మరియు ఒక సోదరి విజయ ఉన్నారు. ఈయన విద్యాభ్యాసం ఏర్పేడు, మరియు తిరుపతిలో జరిగింది.
ఈయన చెన్నై (గతంలో మద్రాసు)లో భౌతిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశాడు. సినీరంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మోహన్ బాబు 1970ల ప్రారంభంలో అర్థ దశాబ్దంపాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు.స్వర్గం నరకం (1975) సినిమాతో తెలుగు తెరకు పరిచమయ్యాడు.
సినీరంగ ప్రవేశంతో మోహన్ బాబుగా మార్చుకున్నాడు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు శిష్యుడిగా గుర్తింపు పొందాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశాడు. విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కళాప్రతిభకు పద్మ శ్రీ పురస్కారం లభించింది.రంగంపేట లో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు స్థాపించాడు.
మోహన్ బాబు 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను స్థాపించాడు. దీనిలో అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల మరియు నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశాడు.
మోహన్ బాబు మొదట విద్యా దేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు మంచు విష్ణు, ఒక కుమార్తె మంచు లక్ష్మి ఉన్నారు. విద్యా దేవి చనిపోవటంతో మోహన్ బాబు విద్యాదేవి చెల్లెలు అయిన నిర్మలాదేవిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు మంచు మనోజ్.