దీపావళి పండుగను ఎన్ని రోజులు పండుగగా జరుపుకొంటారు?
దసరా తర్వాత వచ్చే ఈ దీపావళి పండుగను చిన్న పిల్లలు ఎంతో ఆనందంగా టపాసులు కాలుస్తూ జరుపుకుంటారు. భారతీయ సంస్కృతికి అద్దంపట్టేలా పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగే దీపావళి. ఇది మన ఆంధ్రా – తెలంగాణా రాష్ట్రాలతో సహా తక్కిన దక్షిణ భారతీయులకు ముఖ్య పండుగ.
దీనిని ఐదు రోజుల పండుగగా ఆస్వయుజ మాస బహుళ త్రయోదశి నుంచి జరుపుకొంటారు. మెదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు దీపావళి అమావాస్య, నాల్గవ రోజు గోవర్ధన పూజ ఆఖరిది బలి పాడ్యమి.