Kitchen

దీపావళి స్పెషల్ : రాజ్ భోగ్ స్వీట్

కావల్సిన పదార్థాలు: పాలవిరుగు – 250 గ్రా. (ఆవు పాల నుంచి చేసినది); పచ్చికోవా – 3 టేబుల్ స్పూన్లు; పిస్తాపప్పులు – 15; మైదా – టీ స్పూను; పంచదార – 5 కప్పులు;కుంకుమపువ్వు – అర టీ స్పూను; రోజ్ సిరప్ – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను.

తయారుచేయు విధానం: ముందుగా పాలవిరుగును మెత్తగా మెదిపి, దానికి మైదా జత చేయాలి. దానిని బాగా కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత వేడినీటిలో పిస్తా పప్పులను వేసి ఐదు నిముషాలు ఉంచి, నీటిని వడగట్టి, పైన తొక్కలు తీసి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చికోవా పొడి, పిస్తా తరుగు, బాదం పప్పులను ఒక గిన్నెలో వేసి కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేయాలి.

తర్వాత పాలవిరుగుతో చేసిన ఒక్కో ఉండలో పిస్తా, బాదం మిశ్రమాన్ని స్టఫ్ చేసి పక్కన ఉంచాలి. ఒక పాత్రలో పంచదార, నీరు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి, వెడల్పాటి పాత్రలో పోసి, కుంకుమపువ్వు రేకలు వేయాలి. తయారుచేసి ఉంచుకున్న స్టఫ్‌డ్ బాల్స్‌ని ఇందులో వేసి స్టౌ మీద ఉంచి, ఐదు నిముషాలు ఉడికించాలి.అరకప్పు వేడినీరు పోసి, మరో ఐదునిముషాలు ఉంచితే, బాల్స్ రెట్టింపు సైజుకి పొంగుతాయి. అంతే రాజ్ భోగ్ స్వీట్ రిసిపి రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."