Kitchen

దసరా స్పెషల్ : అరిసెలు

కావాల్సిన పదార్థాలు: బియ్యం – ఒక కిలో, బెల్లం అరకిలో, నువ్వులు – 50 గ్రాములు, నూనె – తగినంత.

తయారుచేయు విధానం: ఒక రోజు ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానిన బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి. పిండిని జల్లించిపెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని బెల్లం కొద్దిగా నీళ్లు పోసుకుని తీగ పాకం పట్టుకోవాలి. అందులో ఈ పిండిని వేసి బాగా కలిపి దించేయాలి.

తరువాత స్టౌ మీద ఒక కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసుకుని బాగా కాగాక పాకంలో కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరిటాకు మీద ఒత్తుకుని నూనె వేయాలి. రెండు వైపులా వేగేలా తిప్పుతూ వేయించాలి. ఎరుపురంగు వచ్చాక ఒక ప్లేటుపై నువ్వులు వేసి వాటిపై ఈ అరెసెలు వేసి ఒత్తాలి. అంతే అరిసెలు రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."