Kitchen

దసరా స్పెషల్ : సున్నండలు

కావల్సిన పదార్థాలు:

నల్ల మినపప్పు (ఉద్దిపప్పు) – రెండు కప్పులు
బియ్యం – పావు కప్పు (క్రిస్పీనెస్ కోసం)
యాలకుల పొడి – పావు టీ స్పూన్
పంచదార – ఒకటిన్నర కప్పు
నెయ్యి – తగినంత

తయారుచేయువిధానం:
ముందుగా నాన్ స్టిక్ పాత్ర తీసుకొని అందులో నల్ల మినప్పప్పు (పొట్టు తీయని మినప్పప్పు)ని వేసి వేయించుకోవాలి. మినప్పప్పు వేగిందో లేదో తెలుసుకోవటానికి, ఓ రెండు గింజలను నేలపై వేసి స్పూన్తో వత్తి చూస్తే అవి పొడిపొడిగా పగిలితే మినప్పప్పు వేగినట్లు అర్థం. వేయించిన మినప్పప్పు స్టవ్ మీద నుంచి దించి వేసే ముందుగా బియ్యం కూడా అందులో వేసి వేయించాలి.

వేడిగా ఉండే మినప్పప్పు చల్లగా అయ్యే వరకూ వేచి ఉండాలి. ఈ లోపుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు పంచదార వేసి మెత్తగా పొడి చేసుకొని ఓ వెడల్పాటి స్టీల్ గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత చల్లగా అయిన మినప్పప్పు బియ్యపు మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా (మరీ మెత్తగా కాకుండా) మిక్సీ పట్టుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా పంచదార పొడి వేసుకున్న స్టీల్ గిన్నెలో వేసి, అందులో యాలకుల పొడిని చేర్చి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులోకి సరిపడా కాచిన నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. ముద్దలు కట్టునునేందుకు వీలుగా మిశ్రమం తయారు చేసుకోవాలి. ఆ తర్వాత చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని ఉండలు చుట్టకోవాలి.

అంతే.. ఎంతో రుచికరమైన సున్నండలు తయారైనట్లే..!