Movies

జబర్ దస్త్ ప్రోగ్రామ్ పై బ్రహ్మానందం పంచ్ డైలాగులు అదరహో… షాక్ లో జబర్దస్త్ టీమ్

‘వెజిటేరియన్ ఫుడ్ తినడం కొంచెం కష్టమే కావచ్చు కానీ తినడం అలవాటైతే నాన్ వెజ్ జోలికి వెళ్ళం’ఇదీ లాఫర్ ఛాలంజ్ ప్రోగ్రాం లో హాస్య బ్రహ్మానందం పంచ్ డైలాగ్. ఈమధ్య టివి షోలు చూడాలంటె భయంగా ఉంది. ఎక్కడ చూసినా డబుల్ మీనింగ్ డైలాగులతో ఇబ్బందికర వాతావరణం అలుముకుంటోంది. కొన్ని షోలు అయితే బూతు చేష్టలతో రోత పుట్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బ్రహ్మానందం కామెడీ షో లాఫర్ ఛాలెంజ్ కుటుంబ సమేతంగా చూడతగ్గ షో గా పేరు తెచ్చుకుంటోంది. అసభ్యతకు తావులేకుండా ఆరోగ్యకరమైన హాస్యంతో ఈ కార్యక్రమం నడుస్తోందన్న పేరు వచ్చింది.

ఇక లాఫర్ ఛాలెంజ్ స్టేజిపై మాట్లాడిన మాటలు సంచలనం అయ్యాయి. చర్చకు దారితీసాయి. ‘స్టాండ్ అప్ కామెడీ షో అంటే భారం అంతా ఒక్కరే మోయాలి. ఇది వన్ మేన్ షో. గ్రూపుగా చేస్తే ఎవరో ఒకరిమీద కాకుండా మొత్తంగా కొట్టుకుపోతుంది. పైగా ఎవరో ఒకరు కామెడీ పండించడానికి వీలవుతుంది. ఇక్కడ అది కుదరదు’అంటూ స్టాండ్ అప్ కామెడీ షో కత్తిమీద సాము లాంటిందని చెప్పుకొచ్చారు.

అలాగే ఈవారం మాట్లాడుతూ ‘అందరం ఎంతో కష్టపడి ఈ షోని ముందుకు తీసుకెళ్తున్నాం. మంచి పేరు వచ్చింది. కుటుంబ సమేతంగా చూడతగ్గ షో గా గుర్తింపు పొందింది. ఇది మనందరికీ సంతోషం. వెజ్ ఫుడ్ తీసుకోవడం కష్టమైనా సరే, అదే తీసుకుని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి’అని కోరారు.

ఇంతవరకూ బానే ఉన్నా బ్రహ్మానందం జబర్ దస్త్,ఎక్స్ ట్రా జబర్ దస్త్ , అలాగే మరికొన్ని షో లపై సెటైర్స్ వేశారని కొందరి వాదన. మరికొందరు విశ్లేషణలు కూడా చేసారు. వాస్తవానికి జబర్ దస్త్,ఎక్స్ ట్రా జబర్ దస్త్ షోలు బానే నడుస్తున్నా, అక్రమ సంబంధాలు,నాన్ వెజ్ జోక్స్,డబుల్ మీనింగ్ డైలాగ్స్ వంటి వాటిపై వివాదాలు అలానే ఉన్నాయి.

హాస్యం పేరిట శృతిమించిపోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్న, టిఆర్పి రేటింగ్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోతోంది. బ్రహ్మానందం కూడా ఇప్పుడు అదే చెప్పారని విశ్లేషకులు అంటున్నారు. అయితే డబుల్ మీనింగ్ డైలుగులు లేకుండా ఉంటె ఇంటిల్లిపాది చూడొచ్చు. లేకుంటే అందరిలో చూడలేక ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరి స్మార్ట్ ఫోన్స్ లో వాళ్ళు చూసేస్తారు. అని పలువురు అంటున్నారు.