. రాజసులోచన జీవితంలో మనకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయని తెలుసా?
పిలాయర్ చెట్టి రాజీవలోచన అంటే ఎవరికీ తెలియదు. కానీ రాజసులోచన అనగానే ఆనాటి తరం నటి అని యిట్టె చెప్పేస్తారు. 1935ఆగస్టు 15న విజయవాడలో జన్మించిన ఈమె తండ్రి భక్త వత్సల నాయుడు ఇండియన్ రైల్వేస్ లో పనిచేసేవారు. జనరల్ మేనేజర్ గా చేసేటప్పుడు మద్రాసు బదిలీ అయింది. అప్పటికే రాజసులోచన చిన్నపిల్ల. ఈమె స్కూల్ రికార్డుల్లో పేరు తప్పు దొర్లింది. దీంతో రాజీవలోచన కాస్తా రాజసులోచన గా స్థిరపడింది. బహుశా అదే ఆమెకు కల్సి వచ్చిందేమో. ఎందుకంటే, 1950నుంచి 1970వరకూ సినీ రంగంలో ఈమె తిరుగులేని హవా కొనసాగించింది. తెలుగు , తమిళ,కన్నడ,మలయాళ,హిందీ భాషల్లో దాదాపు 350సినిమాల్లో నటించిన ఈమె దక్షిణాది భాషల్లోనే 270కి పైగా చిత్రాల్లో చేసింది.
ఇక ఈమె మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. ఏ లలితమ్మ,కె ఎన్ దండయుత పాణి పిళ్ళై,వెంపటి చినసత్యం,కృష్ణకుమారి,మాధవన్ వంటి ఎందరో గురువుల దగ్గర శిక్షణ పొందిన రాజసులోచన లోని అందం, అభినయం చూసి,హెచ్ ఎం సిన్హా 1953లో గుణసాగ్రి అనే మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. ఎంజీఆర్,శివాజీ గణేశన్,ఎన్టీఆర్,అక్కినేని, రాజకుమార్,ఎస్ ఎస్ రాజేంద్ర,ప్రేమ నజీర్, ఎపి నాగరాజన్,ఎం ఎం నంబియార్ వంటి వారందరి సరసన నటించింది.
నటనలో బిజీగానే కొనసాగుతూనే చిన్నారులకు శిక్షణ ఇవ్వడానికి పుష్పాంజలి పేరిట నృత్య సంస్థను 1961లో నెలకొల్పింది.కన్నతల్లి,మాంగల్యం, పెంకి పెళ్ళాం,శ్రీ వెంకటేశ్వర మహత్యం, సొంతూరు,రాజారాణి,సువర్ణ సుందరి,తోడికోడళ్లు,ఇద్దరు మిత్రులు, శభాష్ రాజు,చిట్టి తమ్ముడు, చక్రవాకం, కరుణామయుడు,చిన్నకోడలు వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకాదరణ పొందింది.
దేశవిదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చిన రాజసులోచన ఇక వ్యక్తిగత జీవితంలో మొదటి భర్తకు విడాకులిచ్చింది. అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. ఇక నటుడు , దర్శకుడు అయిన సి ఎస్ రావుని వివాహం చేసుకోవడంతో ఇద్దరు ఆడపిల్లలు ( కవలలు) జన్మించారు. ఇక ఈమె 2013మార్చి 5వ తేదీన 77ఏళ్ళ వయస్సులో చెన్నైలో కన్నుమూసింది.
ఇక తన ఆస్తిలో విలువైన భాగాన్ని తాను నెలకొల్పిన నృత్య కళాశాలకు రాసిచ్చేసి, తన కళాభిమానాన్ని చాటుకుంది. కాగా ఆమె కుమారుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఒక కుమార్తె టాలెంటెడ్ డాన్సర్ గా పేరుతెచ్చుకుంది.