Movies

చిత్రం శ్రీను వైఫ్ టాలీవుడ్ డాన్సర్ అని తెలిస్తే షాకవుతాం… పెళ్లి ఎలా జరిగిందో తెలుసా?

సినీ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరికి బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. కొందరు స్వయం కృషితో వస్తారు. కొందరికి మొదటి సినిమాయే ఇంటిపేరుగా మారిపోయి పాపులర్ అవుతారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. తొలిసినిమా ఇంటిపేరుగా శుభలేఖ సుధాకర్,ఆహుతి ప్రసాద్, కళ్ళు చిదంబరం,ఇలా చెప్పుకుంటూపొతే చాలామంది ఉంటారు. అయితే తేజ తొలిసారి డైరెక్ట్ చేసిన మూవీ ‘చిత్రం’ దాదాపు అందరూ కొత్తవారితో తీసిన ఈసినిమా అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. కాలేజ్ స్టూడెంట్స్ ని , యూత్ ని టార్గెట్ గా చేసుకుని నిర్మించిన ఈ మూవీ లో శ్రీను అనే కేరక్టర్ నటుడు నటించాడు. ఇక ఈ మూవీ తర్వాత అతని ఇంటిపేరు అదే అయింది. ఆవిధంగా చిత్రం శ్రీను అని పాపులర్ అయ్యాడు.

తాను నటించిన తొలిచిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు రావడంతో చిత్రం శ్రీనుకి ఛాన్స్ లు కూడా తరుముకుంటూ వచ్చాయి. అలా దాదాపు 200పైగా సినిమాల్లో నటించాడు. ఆనందం,100%లవ్,వెంకీ , బాబు బంగారం అమ్మాయి బాగుంది,నువ్వులేక నేను లేను,బొమ్మరిల్లు,సొంతం,భలేదొంగలు,ఇలా ఎన్నో సినిమాల్లో చిత్రం శ్రీను నటనకు అద్దం పట్టాయి .

ముఖ్యంగా బొమ్మరిల్లు మూవీలో ఇతడి నటన అందరినీ నవ్వించేసింది. ఇక ఆనందం సినిమాలో ఇంటి ఓనర్ ఎం ఎస్ నారాయణను ఏడిపించే పాత్రలో కడుపుబ్బా నవ్వించాడు. చిత్రం శ్రీను సినిమాల మాట ఇలా ఉంటే,వ్యక్తిగత జీవితంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇతనికి పెళ్లయింది. అయితే పెళ్లయిన తర్వాత తనను వేధిస్తున్నాడని అతని భార్య కేసు పెట్టి,కోర్టుకు వెళ్ళింది.

కోర్టులో కేసు నడుస్తుండగానే చిత్రం శ్రీను ఇంకొకావిడను ప్రేమించి, పెళ్లి చేసేసుకున్నాడు. ఇలా రెండో పెళ్లి చేసుకున్న ఆమె ఎవరో తెలిస్తే నిజంగా షాకవుతాం. ఐటెం సాంగ్స్ లో పెట్టింది పేరు గా నిలిచిన మనిటాను పెళ్లిచేసుకున్నాడు. అయితే ఇలాంటి ఘటనల కారణంగా అతని సినీ కెరియర్ కి ఇబ్బంది తెచ్చిపెట్టింది. సో మళ్ళీ పుంజుకోవడానికి సమయం పడుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."