Politics

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఇంటరెస్టింగ్ న్యూస్… ఏమిటో చూడండి

సమైక్య ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నిజానికి దేశంలో క్రికెటర్లు ఎంపీలు,ఎమ్మెల్యేలు అవుతారు తప్ప సీఎం అవ్వలేరు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఆఘనత సొంతం చేసుకున్నారు. సౌత్ జోన్ లెవెల్లో అత్యుత్తమ క్రికెటర్ గా రాణించిన ఈయన కెప్టెన్సీలోనే ఇంటర్ నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్న అజారుద్దీన్ కూడా ఆడాడంటే అర్ధం చేసుకోవచ్చు. హర్ష గోగిలేటి కూడా కిరణ్ కెప్టెన్సీ లో సాధారణ ఆటగాడే. అయితే కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి రావడంతో సీఎం అయ్యారు. లేకుంటే క్రికెటర్ గా టీమ్ ఇండియాను లీడ్ చేసేవాడని చాలామంది క్రికెటర్లు చెబుతారు.

కిరణ్ తల్లి అమరానాధ్ రెడ్డి, తల్లి సరోజనమ్మ. వీళ్లది మొదటినుంచి రాజకీయ కుటుంబం. ఇద్దరూ కాంగ్రెస్ నేతలుగా రాణించారు. ఇక 1989లో రాజకీయాల్లోకి చేరి,ఎమ్మెల్యేగా పోటీచేసి ఘనవిజయం అందుకున్నారు. అయితే 1994లో ఓడిపోయారు. ఓటమి నుంచి కసి పెంచుకున్న కిరణ్ పట్టుదలతో పనిచేసి,1999,2004,2009ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేసుకున్నారు. హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చీప్ విప్ గా , ఆతర్వాత స్పీకర్ గా పనిచేసారు.

వైఎస్ మరణంతో రోశయ్య సీఎం అవ్వడంతో స్పీకర్ గా కొనసాగిన కిరణ్,ఆతర్వాత అనూహ్యంగా సీఎం పదవిని దక్కించుకున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రాన్ని విభజించాలని భావిస్తే,కిరణ్ తీవ్రంగా వ్యతిరేకించి,కాంగ్రెస్ కి రాజీనామా చేసారు. 2014ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. అయితే దారుణంగా ఓటమి చవిచూడ్డంతో రాజకీయాలకు దూరమయ్యారు.

ఇక ఆయన అనుచరులు తలో పార్టీలో చేరిపోయారు. సొంత తమ్ముడు సంతోష్ కుమార్ రెడ్డి కూడా టిడిపిలో చేరడంతో నాలుగేళ్లుగా వ్యాపారాలపై దృష్టి పెట్టిన కిరణ్ పై, టిడిపి,జనసేన దృష్టిపెట్టాయి. కొన్ని ప్రయత్నాలు కూడా చేసాయి. అయితే చివరకు గత జులైలో కాంగ్రెస్ లో చేరారు. అదికూడా స్వయంగా రాహుల్ ఆహ్వానించడంతో నే జరిగింది.