Movies

సుమన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో భాను చందర్….నమ్మలేని నిజాలు

మనవూరి పాండవులు, ఆడవాళ్ళూ మీకు జోహార్లు చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న భానుచందర్ అనగానే మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతుడు,కరాటే వీరుడు గుర్తొస్తాడు. ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు తనయుడైన భానుచందర్ కరాటేలో బ్లాక్ బెల్ట్. నిజానికి సంగీతంలో ప్రావిణ్యం సంపాదించిన యితడు అనూహ్యంగా కరాటే నేర్చుకోవడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ ని చేయాలని భానుని నౌషాద్ దగ్గర వేణు గారు చేర్చారు. ముంబై కల్చర్ కారణంగా దారితప్పిన భానుచందర్ డ్రగ్స్ కి బానిసయ్యాడు. దాంతో అతని సోదరుడు అతన్ని డ్రగ్స్ నుంచి మాన్పించడానికి కరాటేలో చేర్చాడు. ఆవిధంగా కరాటేలో దృష్టి పెట్టిన భాను పూర్తిగా మారిపోయాడు.

కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన భాను చందర్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరి నటనలో ఓనమాలు దిద్దుకున్నాడు. ఆతర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఇప్పటిదాకా 200పైగా మూవీస్ లో నటించాడు. ఇక ఇతనికి బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉంటె అది సుమన్. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ గల సుమన్ తమిళంలో చిన్నాచితకా వేషాలు వేస్తుంటే,తెలుగులోకి భానుచందర్ ఇంటర్ డ్యూస్ చేసాడు.

అయితే అనుకోకుండా సుమన్ బ్లు ఫిలిం కేసులో ఇరుక్కున్నాడు. ఓరోజు భానుచందర్ కారులో వస్తుంటే ఎదురుగా ఓ కారు ఆగింది. అందులోంచి దిగిన సుమన్ ని ఏంట్రా ఇలా ఉన్నావ్ అని భాను అడిగితె ఇక మీదట నన్ను కలవద్దు,కలిసావంటే నిన్ను కూడా జైల్లో వేస్తారు’అని సుమన్ చెప్పాడు. ఎందుకు ఏమిటి అని అడిగితె అసలు విషయం సుమన్ చెప్పాడట.

నన్ను ఎవరు కలిసినా, వాళ్లకి కూడా కేసులో భాగం ఉందని అనుమానిస్తారని అందుకే నిన్ను రావద్దని అంటున్నానని సుమన్ గట్టిగా చెప్పాడట. తాను కష్టంలో ఉండికూడా సాయం కోరకుండా,మన క్షేమం కాంక్షించే రియల్ ఫ్రెండ్ నాకు సుమన్ లో కనిపించాడని భాను ఓ ఇంటర్యూలో చెప్పాడు.