సైరా డైరెక్టర్ సురేంద్ర రెడ్డి వైఫ్ దీపారెడ్డి సినిమాలకు దూరంగా చేసే బిజినెస్ ఏమిటో తెలుసా ?
సినీ పరిశ్రమలో ఒక్క సినిమా ప్లాప్ అయితే చాలు అసలు వారి వైపు కన్నెత్తి చూసేవారు ఉండరు. అలాంటి తెలుగు ఇండస్ట్రీలో హిట్స్ ,ఫట్స్ తో సంబంధం లేకుండా గత పెదేళ్ళుగా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసున్న ఘనత డైరెక్టర్ సురేంద్ర రెడ్డికే దక్కుతుంది. అతనొక్కడే మూవీతో టేకింగ్ ఎలా ఉంటుందో రుచి చూపించిన సురేంద్ర రెడ్డి ఆతర్వాత అశోక్,కిక్,ఊసరవెల్లి,రేసుగుర్రం,కిక్ – 2,ధ్రువ ఇలా పలు సినిమాలతో స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇతని భార్య దీపారెడ్డి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రామ్ చరణ్ భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
సురేంద్రరెడ్డి డిగ్రీ మధ్యలోనే స్టడీస్ గుడ్ బై చెప్పేసి, తొలిరోజుల్లో దారుణమైన అనుభవాలను చవిచూశాడు. యితడు 2010లో దూరపు బంధువు అయిన దీపారెడ్డిని ఓ ఫంక్షన్ లో కలుసుకున్నాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఏర్పడడం, మొదట్లో పెళ్లి ఆలోచన ఇద్దరికీ లేకున్నా పెద్దలు నచ్చజెప్పడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో సినీ ప్రముఖుల మధ్య అంత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది.
వ్యాపార రంగం నుంచి వచ్చిన దీపారెడ్డికి వ్యాపార రంగం అంటే మక్కువ. బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేషన్ చేసిన దీపారెడ్డి,వ్యాపారం మొదలు పెట్టింది. పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యాక గచ్చీబౌలిలో ఉలవచారు పేరిట ఓ పెద్ద రెస్టారెంట్ స్టార్ట్ చేసింది. గచ్చీబౌలి ఏరియా వాళ్ళే కాకుండా,సిటీలోని పలు ప్రాంతాలనుంచి ఈ రెస్టారెంట్ కి రెగ్యులర్ కస్టమర్లు వస్తుంటారు. ఇక సురేంద్ర రెడ్డి సైరా మూవీని ప్రతిష్ఠాత్మకంగా భావించి,డైరెక్ట్ చేస్తున్నందున ఈ మూవీ అనూహ్య విజయం అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు.